ఆంధ్రప్రదేశ్‌

వివాద రహిత గ్రామంగా ఫతేపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 9: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలం ఫతేపురం గ్రామాన్ని వివాదరహితంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని తెలిపారు. శనివారం ఉదయం ఒంగోలు నగరంలోని జిల్లా న్యాయస్ధానం ఆవరణలోని న్యాయసేవసదన్‌లో జిల్లా న్యాయమూర్తిప్రియదర్శిని జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఫతేపురంగ్రామంలో 2014 సంవత్సరంనుండి ఎలాంటి వివాదాలు లేకుండా ఆదర్శ గ్రామంగా నిలుస్తోందన్నారు. గ్రామప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో కక్షలు, రాజకీయగొడవలు ప్రభావం ఏమాత్రం లేకుండా చక్కటి జీవన విధానం సాగిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి రాజావెంకటాద్రి మాట్లాడుతూ జిల్లా న్యాయచరిత్రలో ఇది మరిచిపోలేని సంఘటన అన్నారు. ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేకుండా, పోలీసుస్టేషన్లను, కోర్టులను ఆశ్రయించకుండా ప్రశాతంగా, సుఖసంతోషాలతో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా ఫతేపురం గ్రామప్రజలు 40మంది వరకు సర్పంచ్ రత్తాయామ్మ ఆధ్వర్యంలో ఒంగోలుకు రాగ వారికి జిల్లా ప్రధానన్యాయమూర్తి అవార్డును అందించి అభినందించారు. ఈకార్యక్రమంలో చైల్డ్‌లైన్ సమన్వయకర్త బివి సాగర్, అడ్వకేట్లు శ్రీలక్ష్మి, విజయకుమారి, ఫతేపురం గ్రామప్రజలు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..జిల్లా జడ్జి చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న ఫతేపురం సర్పంచ్