ఆంధ్రప్రదేశ్‌

స్టార్టప్‌లకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: ఏపీలో సరికొత్త ఆలోచనలతో ప్రారంభించే స్టార్టప్ కంపెనీలకు నేషనల్ రిసెర్చ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఆర్‌డిసి) చేయూతనివ్వనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ హెచ్.పురుషోత్తం వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో సుమారు వెయ్యి పరిశోధనా సంస్థలు, 800 యూనివర్శిటీల్లో వివిధ అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందించాలన్నది ప్రధాన మోదీ ఉద్దేశమని చెప్పారు.
దేశంలోని వివిధ సమస్యల పరిష్కారానికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని అన్నారు. స్టార్టప్ కంపెనీలు ఈ పరిశోధనల ద్వారా సమాజానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేయచ్చని ఆయన చెప్పారు. ఈ పరిశోధనా ఫలాలను స్టార్టప్ కంపెనీలకు అందించే బాధ్యత ఎన్‌ఆర్‌డిసి తీసుకుంటుందని పురుషోత్తం చెప్పారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌డిసి వద్ద 2,500 టెక్నాలజీస్ సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. కాగా, ప్రతి ఉత్పత్తికి పేటెంట్ హక్కులు చాలా అవసరమని పురుషోత్తం చెప్పారు. స్టార్టప్ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు తెచ్చుకునేందుకు కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందని, వీటిని కేవలం రెండు సంవత్సరాల్లో తీసుకువచ్చే బాధ్యత తమ సంస్థ తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌డిసి 1700 పేటెంట్ హక్కులను ప్రొటెక్ట్ చేసిందని అన్నారు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఉత్పత్తిని మార్కెట్‌లోకి పంపించే వరకూ చాలా మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. ఇటువంటి కంపెనీలకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎన్‌ఆర్‌డిసి 10 వేల కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పటికే స్టార్టప్ కంపెనీలు వెయ్యి కోట్ల రూపాయల వరకూ వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అలాగే, 2000 క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌లు కూడా సిద్ధం చేశామని అన్నారు. పేటెంట్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చులో 80 శాతాన్ని ఎన్‌ఆర్‌డిసి భరిస్తుందని చెప్పారు. అలాగే స్టార్టప్ కంపెనీలు ప్రారంభించినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకూ ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ రాయితీలన్నీ కేవలం సరికొత్త ఆలోచనలతో ప్రారంభించే స్టార్టప్ కంపెనీలకు మాత్రమే ఇవ్వనున్నామని ఆయన వివరించారు.
రాష్ట్రంలో ఇన్నోవేటివ్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఎన్‌ఆర్‌డిసి ఆసక్తితో ఉందని పురుషోత్తం చెప్పారు. ఆధునిక సాంకేతికత, స్టార్టప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ఏపి ప్రభుత్వంతో ఎన్‌ఆర్‌డిసి సోమవారం ఎంఓయు కుదుర్చుకోనుందని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఎన్‌ఆర్‌డిసి సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పురుషోత్తం