ఆంధ్రప్రదేశ్‌

గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సామాజిక హక్కు ల వేదిక రాష్ట్ర కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భేతాళ సుదర్శనరావు అధ్యక్షతన విజయవాడ రైల్వే ఎంప్లారుూస్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గరగపర్రులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడమే కాకుం డా గ్రామ దళితులను అగ్రవర్ణాలవారు సాంఘిక బహిష్కరణకు గురిచేసిన సంఘటన దుర్మార్గమన్నారు.
గరగపర్రు గ్రామ దళితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు సామాజిక హక్కుల వేదిక, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆ గ్రామా న్ని సందర్శించడంతో పాటు దళితవాడలో ఆత్మీయ నిద్రచేసి వారికి అండగా నిలిచామన్నారు. గరగపర్రులో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల ని, వివక్ష ఎదుర్కొన్న దళితులందరికీ న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు మాట్లాడుతూ ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆనందబాబును కలిసి వినతిపత్రం అందించామని, గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి హామీ మేరకు ఈ నెల 28న చేపట్టనున్న ‘చలో గరగపర్రు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే ఈ ఆందోళన కార్యక్రమం జరపాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కరవది సుబ్బారావు, నాయకులు బుట్టి రాయప్ప, సిహెచ్ శ్రీనివాసరావు, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఎఐటిఆర్‌ఎఫ్ నాయకులు వి శామ్యూల్, దళిత మహాసభ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్, దళిత జెఎసి నాయకుడు ఎం విక్టర్ ప్రసాద్, ఆదివాసీ సేవా సంఘం నాయకుడు దేవరకొండ వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.