ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌ఐఎ నివేదిక ఏమైనట్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 10: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, కూనేరు రైల్వే స్టేషన్‌లో హిరాఖండ్ ప్రమాద ఘటన జరిగి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నివేదికను బహిర్గతం చేయలేదు. ఈ సంఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికిపైగా గాయాల పాలైన విషయం విదితమే. కాగా, ఈ రైలు ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? విద్రోహ చర్య లేదా సాంకేతిక లోపమా అనే అంశంపై ఎన్‌ఐఏ అనేకమార్లు సంఘటన స్థలానికి వచ్చి అనేక మంది నుంచి వివరాలు సేకరించింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో మావోయిస్టుల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో కూడా దర్యాపు జరిపారు. మాజీ మావోయిస్టులను, జైళ్లలో ఉన్న మావోల నుంచి కూడా వివరాలు సేకరించినట్టు భోగట్టా. అంతేకాకుండా క్షతగాత్రుల నుంచి ఆధారాలను సేకరించారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు కూడా వచ్చి వాటిని పరిశీలించారు. అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, రైల్వే సేఫ్టీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులపై అంచనా వేశారు. ఈ సంఘటన కేబిన్‌కు కేవలం 200 అడుగుల దూరంలో జరగడంతో అప్పటి డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీని బదిలీ చేశారు. పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అయితే, వాస్తవానికి ఈ రైలు ఘటన తరువాత వివిధ రాష్ట్రాల్లో అనేక రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకదాని వెంట మరొకటి రైలు ప్రమాదాలు జరగడంతో సాంకేతిక లోపమా? విద్రోహమా? అన్నదీ స్పష్టం కావడం లేదు. గతంలో రైలు ప్రమాదాలు జరిగినపుడు నెల రోజుల్లోనే ఉన్నతాధికారులు ప్రమాదానికి గల కారణాలపై నివేదికను అందజేసేవారు. హిరాఖండ్ రైలు ఘటనపై నేటి వరకు నివేదికను ప్రకటించకపోవడానికి కారణాలు ఏమిటన్నది ఇదమిత్థంగా తెలియడం లేదు.

ప్రమాదానికి గురైన హిరాఖండ్ రైలు (ఫైల్ ఫొటో)