ఆంధ్రప్రదేశ్‌

ఓబయ్య, రేఖారాణికి హిందీ సేవా పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటిలా ఈ ఏడాది కూడా హిందీ భాషాభివృద్ధికి దక్షిణ భారతం స్థాయిలో విశేష కృషి చేసినవారికి మదనురే ప్రభు విశిష్ట హిందీ సేవా పురస్కార్-2017 అవార్డులను హిందీ సేవాసదన్ వ్యవస్థాపకులు, కార్యదర్శి ఎస్ గైబువల్లి ఆదివారం నాడిక్కడ ప్రకటించారు. ప్రచార విభాగంలో పోలిశెట్టి ఓబయ్యని ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం దక్షిణ భారత హిందీ ప్రచార సభ తెలంగాణ, ఆంధ్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. హిందీ భాషాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సంయుక్త కమిషనర్‌గానూ పనిచేశారు. ఇక రచనా విభాగంలో డా. టిజె రేఖారాణిని ఎంపిక చేశారు. ఈమె ప్రస్తుతం ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె సోద్ ఇంటర్నేషనల్ ఈ-జర్నల్ అసోసియేట్ ఎడిటర్‌గా, సంవాద్ పత్రికకు, దేశవ్యాప్తంగా పలు హిందీ పత్రికలకు రచనలు అందిస్తున్నారు. సామాజిక పరిస్థితులపైనా హిందీలో అనేక రచనలు చేశారు. అవార్డు గ్రహీతలకు హిందీ సేవాసదన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పరిషత్ హాలులో నిర్వహించే హిందీ భాషా దినోత్సవ కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నట్లు గైబువల్లి వివరించారు.