ఆంధ్రప్రదేశ్‌

ఒకేదఫా రుణమాఫీకి సంతకాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రైతు రుణమాఫీ ప్రక్రియలోని సాంకేతిక సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతో పాటు 4, 5 విడతల్లోని రుణమాఫీ నిధులు ఒకేసారి విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతుల సంతకాల సేకరణ జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామచంద్రయ్య, కెవివి ప్రసాద్ ఆదివారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. ఈ నెల 25, 26తేదీల్లో మండల తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, 2004 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి రాగానే రైతుల రుణాలు రద్దుచేస్తామని, బకాయిలు కూడా చెల్లించవద్దని పిలుపునిచ్చారని వారు గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే పమిడి కోటయ్య కమిటీని నియమించి, సుమారు రూ. 84వేల కోట్లు ఉన్న రుణమాఫీ లక్ష్యాన్ని రూ. 24వేల కోట్లకు పరిమితం చేశారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక పరిస్థితి, నిధుల కొరత వల్ల ప్రతి రైతు కుటుంబానికి రూ. 1.5లక్షల వరకు 5 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ. 11,077 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. మూడో విడతలో రూ.3600 కోట్లు విడుదల చేసేందుకు 5 నెలలకు పైగా సమయం పట్టిందన్నారు. గత రెండు విడతల్లో సాంకేతిక సమస్యల వల్ల అనేక మంది రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారని వారు పేర్కొన్నారు. వారంతా వివిధ జిల్లాల నుండి ప్రతిరోజూ ‘గన్నవరం సాధికార సంస్థ’కు రావటం కష్టతరంగా ఉందన్నారు.