ఆంధ్రప్రదేశ్‌

ఐక్య ఉద్యమాలతోనే డిమాండ్ల సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే ఐక్య ఉద్యమాలే శరణ్యమని, ఆందోళనల ద్వారానే డిమాండ్లను సాధించుకోగలుగుతామని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను ప్రతిఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం అన్ని కార్మిక సంఘాలు ఏకం కావాలని ఆమె పునరుద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల, ఫెడరేషన్ల రాష్ట్ర సదస్సు ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు అధ్యక్షతన ఆదివారం స్థానిక మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశంలో కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తోందని విమర్శించారు. మొత్తం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించే చర్యల్లో భాగంగా ఆగస్టు 8న వేతనాల కోడ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందన్నారు. కార్మికుల ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ డబ్బును షేర్ మార్కెట్‌కు మళ్లిస్తోందన్నారు. పారిశ్రామిక సంబంధాల బిల్లును కూడా పార్లమెంట్‌లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్నారు. సామాజిక భద్రత బిల్లును కూడా బహిరంగ పరచిందన్నారు. పని పరిస్థితులు, ఆరోగ్యం, భద్రతలకు సంబంధించిన బిల్లు రూపకల్పన జరుగుతున్న తీరు పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె సహా అనేక హక్కులను కార్మికుల నుంచి దూరం చేసి, ఇష్టానుసారంగా నిబంధనలను ఈ బిల్లులో చేర్చిందన్నారు. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని అమర్‌జిత్ కౌర్ విజ్ఞప్తి చేశారు.
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాయని, కార్మిక చట్టాల సవరణ పేరుతో హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ నల్లధనం నిర్మూలన, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునే చర్యలంటూ కేంద్రం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ ఉద్యోగులు, కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. అఖిల భారత స్థాయిలో 12 డిమాండ్ల సాధన కోసం నవంబరులో చేపట్టే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక కార్మిక వ్యతిరేక విధానాలపై డిసెంబర్‌లో విజయవాడలో జరగనున్న కార్మికుల భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సదస్సుకు వివిధ సంఘాల నాయకులు, అన్ని జిల్లాలనుండి వేలాది సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.