ఆంధ్రప్రదేశ్‌

ఆ 4వేల కోట్లు.. ఇక అంతే సంగతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణంలో చోటుచేసుకున్న 4150 కోట్ల రూపాయల కుంభకోణంపై ప్రభుత్వం వౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. గృహ నిర్మాణంలో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిన నిధులు రాబట్టడంలో వెనుకంజ వేస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో దాదాపు పదేళ్ల కాలంలో ఇందిరమ్మ పథకం కింద భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మించారు. ఒక్కో ఇంటికి దాదాపు 1.3 లక్షల రూపాయలను అప్పటి ప్రభుత్వం ఖర్చుచేసింది. దాదాపు 13,648 కోట్ల రూపాయలను పేదల గృహ నిర్మాణానికి ఖర్చుచేసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. గడిచిన పదేళ్ల కాలంలో నిర్మించిన ఇళ్లపై 2015లో సర్వే చేయించింది. అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ఒక మంత్రివర్గ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ జిల్లాల్లో నిర్మించిన గృహాలు, తదితర వివరాలు సేకరించింది. ప్రస్తుత 13 జిల్లాల పరిధిలో 43 లక్షల గృహాలను నిర్మించగా అందులో 7 లక్షల గృహాల వివరాలు రికార్డుల్లో లేవు. తెలంగాణ పరిధిలో 22.5 లక్షల గృహాలు నిర్మించగా, అందులో మూడోవంతు గృహాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదు. రాష్ట్రానికి సంబంధించినంత వరకూ దాదాపు 7 లక్షల గృహాలు రికార్డుల్లో ఉన్నా, వాస్తవంలో లేవు. ఈ ఇళ్లకు సంబంధించి దాదాపు 4150 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఒక లబ్ధిదారునికే రెండుసార్లు ఇళ్లు మంజూరు చేయటం వంటి అక్రమాలు వెలుగుచూశాయి. గృహాలు నిర్మించకుండానే భారీ మొత్తంలో నిధులు పక్కదోవ పట్టించినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ నిధులు రాబట్టే అంశంపై ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. నిధులు లబ్ధిదారుల పేరిట విడుదలయ్యాయని, కానీ వారికి తెలియకుండానే కొందరు స్వాహా చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండా ఇళ్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. మృతుల పేరిట కూడా ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా నిధులు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం లబ్ధిదారుని పేరిట నిధులు డ్రా చేశారని, కానీ ఆ విషయం వారికి తెలియదని ఆ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇటీవల వ్యాఖ్యానించారు. లబ్ధిదారునికి తెలియకుండానే నిధుల చెల్లింపు జరగడంతో ఆ నిధులు రాబట్టడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సిబిసిఐడి వంటి సంస్థలతో విచారణ చేయిస్తే ఈ వ్యవహారంలో భాగస్తులైన అధికారులు, అనధికారుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఈ అంశాన్ని పక్కనపెట్టడం, సర్వే పేరిట కొండని తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.