ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు ఎఎస్‌పి అరుదైన రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 11: రష్యాలోని ఎతె్తైన పర్వతమైన వౌంట్ ఎల్బృస్ చిత్తూరు ఏఎస్పీ రాధిక విజయవంతంగా అధిరోహించి మరో అరుదైన రికార్టును సాధించారు. భారత దేశం నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిగా కీర్తి గడించారు. వౌంట్ ఎల్బృస్ యూరోపియన్ ఖండంలో ఎతె్తైన పర్వతం, దీని ఎత్తు 18,510 అడుగులు , ఎంతో క్లిష్టతరమైన ఈ పర్వతాన్ని ఏఎస్పీ రాధిక ఈనెల 8న అధిరోహించి భాతర దేశ జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. పర్వతారోహణలో దిట్ట అయిన రాధికా ఇప్పటికే ప్రపంచలోనే ఎతె్తైన అనేక పర్వత శ్రేణులను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు , ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని కొసిజో, యూరఫ్ లోని ఎల్‌బ్రిన్ పర్వత శిఖరాలను అధిరోహించారు. వివిధ దేశాలల్లో ఉన్న ఎతె్తై న పర్వతాలను అధిరోహించి ప్రత్యేకతను చాటుకున్నారు. పర్వతారోహణలో అరుదైన రికార్డు సాధించిన చిత్తూరు ఏఎస్పీ రాధికా దేశానికే గర్వకారణంగా నిలిచారని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, జిల్లా పోలీసు సంఘం ప్రతినిధులు కొనియాడారు. ఈ నెల 13న ఏ ఎస్పీ రాధికా భారత దేశానికి తిరిగి రానున్నారు.

చిత్రం..ఎల్బృస్ పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న చిత్తూరు ఏఎస్పీ రాధిక