ఆంధ్రప్రదేశ్‌

పలువురు డిఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 11: రాష్ట్రంలో పలువురు డిఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఎస్‌వి గోపాలకృష్ణను కర్నూలు జిల్లా నంద్యాల ఎస్‌డిపిఓగా నియమించారు. ఇక్కడ పని చేస్తున్న యు రవిప్రకాష్‌ను నంద్యాల ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డిస్ట్రిక్ ఆర్మ్‌డ్ రిజర్వు డిఎస్పీగా పని చేస్తున్న వి శ్రీనివాసన్‌ను పశ్చిమగోదావరి జిల్లా డిఏఆర్ డిఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న బి చంద్రశేఖర్‌ను నెల్లూరు జిల్లా డిఏఆర్ డిఎస్పీగా నియమించారు. ఇంటిలిజెన్స్ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఏఆర్ డిఎస్పీ కె భాస్కరరావును ఇక్కడే కొనసాగిస్తారు. ఇంటిలిజెన్స్ డిఎస్పీగా పని చేస్తున్న జిఆర్‌ఆర్ మోహన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా నియమించారు. ఇక్కడ పని చేస్తున్న పి భాస్కరరావును పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.