ఆంధ్రప్రదేశ్‌

మానవ చరిత్రను మార్చిన అక్టోబర్ మహావిప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: మానవ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ మహావిప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైందని, ప్రపంచ, మానవ చరిత్రపై ఈ విప్లవ ప్రభావం తీవ్రంగా ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అక్టోబర్ మహావిప్లవ శతవార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోవియట్ యూనియన్ లేకపోయినప్పటికీ ఈ విప్లవం ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య విప్లవం సాధించాలంటే కార్మికులతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులను కూడా సమీకరించాల్సిన అవసరం ఉంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ మూడు వర్గాలతోనే ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్న ప్రజలను సమీకరించి విప్లవం ద్వారా సమాజంలో మార్పునకు మరోసారి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదారుల గుప్పెట్లో చిక్కుకున్నారని, దీంతో నష్టపోతున్న కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించే నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతూ పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. మతోన్మాద రాజకీయాలు పెరిగి దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, పెరిగిన సామాజిక దౌర్జన్యాలను నిరోధించడానికి ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కోరారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి