ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో డిజిపి వాహనానికి ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, సెప్టెంబర్ 11: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) నండూరి సాంబశివరావు ప్రయాణిస్తున్న వాహనం సోమవారం ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి డిజిపి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలావున్నాయి... సోమవారం ఉదయం 12 గంటల సమయంలో డిజిపి సాంబశివరావు కారులో 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా రాజమహేంద్రవరం నుండి విజయవాడ వెళుతున్నారు. ఆయన వాహన శ్రేణి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఒక ట్రాన్స్‌పోర్టు వాహనం డ్రైవరు స్పీడుబ్రేకరు రావడంతో సడన్ బ్రేకు వేశాడు. దీనితో డిజిపి ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ఆ వాహనాన్ని వెనుక నుండి ఢీకొంది. ఇలా వరుసగా వాహన శ్రేణిలోని వాహనాలు ఒకదాన్ని మరొకటి వెనక నుండి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిజిపి వాహనం ధ్వంసమయ్యింది. అయితే డిజిపి, డ్రైవర్, భద్రతాసిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం డిజిపి తన వాహన శ్రేణిలోని వేరే వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా కలవరానికి గురైన స్థానిక పోలీసు యంత్రాంగం ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.