ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అగ్రిగోల్డ్ టేకోవర్‌కు తనకు అనుమతి ఇవ్వాలని ఎస్సెల్ గ్రూప్ రాష్ట్ర హైకోర్టును కోరింది. టేకోవర్‌కు అనుమతి ఇస్తే నాలుగు నెలల్లో దానిని స్వాధీనం చేసుకుంటామని ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసులపై సోమవారం విచారణ జరిగినపుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై స్పందించిన కోర్టు, ఎంత నగదును తక్షణం డిపాజిట్ చేయగలరని ఎస్సెల్ గ్రూప్‌ను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ వెయ్యి నుండి 2వేల కోట్ల రూపాయిల చెల్లింపునకు కంపెనీ సిద్ధంగా ఉందని అన్నారు. తదుపరి విచారణను కేసు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఆయేషా మీరా కేసులో విచారణ
విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సమగ్ర విచారణ జరిపించాలని ఉస్మానియా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ రమా మెల్కోటె దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు సోమవారం నాడు విచారణ జరిపింది. పొలీసులు అనేక లోపాలకు పాల్పడ్డారని పిటీషనర్ ఆరోపించారు. బాధితురాలి వయస్సు 17 ఏళ్లే అయినా 19 ఏళ్లుగా చూపించారన్నారు.
ప్రైవేటు ఆపరేటర్ల తీరుపై ఆగ్రహం
ప్రైవేటు రవాణా ఆపరేటర్లు మోటారు రవాణా కార్మికుల చట్టం 1961 ప్రకారం కార్మిక శాఖతో రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనలను ఎందుకు పాటించడం లేదని హైకోర్టు సోమవారం నాడు ప్రశ్నించింది. కెవి సుబ్బారెడ్డి అనే న్యాయవాది దాఖలు పిల్‌ను విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ టి రజనిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.