ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పల్లెకూ ‘సోలార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో ప్రయోగాత్మకంగా సోలార్ బ్యాటరీ స్టోరేజీ, సోలార్ గ్రిడ్ అనుసంధాన విధానాలను అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విద్యుత్ రంగానికి సంబంధించి కీలక సమావేశం బుధవారం జరుగున్న నేపథ్యంలో ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు సహా ఆ శాఖ అధికారులతో వెలగపూడి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రతి పల్లెనూ, ప్రతి గడపనూ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చేస్తున్నామన్నారు. తన అమెరికా పర్యటన విద్యుత్ రంగంలో కొత్త అడుగులు వేసేందుకు దోహదపడిందని, సౌర విద్యుత్‌ను బ్యాటరీలలో నిక్షిప్తం చేయగల సాంకేతికతను ‘టెస్లా’ అనుసరించడం, బ్యాటరీ కారును డ్రైవర్లు లేని కారును రూపొందించడం చూశానన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను బ్యాటరీలలో నిక్షిప్తం చేస్తే విద్యుత్ కష్టాలే ఉండవనే ఆలోచనకు వచ్చానని, ఆ ఆలోచనను అమలుచేసే బాధ్యతను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్‌కు అప్పగించానని గుర్తు చేశారు. టెస్లా తరహాలో రాష్ట్రంలోనూ సోలార్ బ్యాటరీ స్టోరేజీ విధానాన్ని అమలుచేస్తే రాష్ట్ర ఇంధన ప్రగతి మారిపోతుందని సూచించానన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపిపిసిసి) విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో సోలార్ బ్యాటరీ స్టోరేజీ, సోలార్ గ్రిడ్ అనుసంధానానికి టెండర్లు పిలువగా, గ్రీన్‌కో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్-1గా నిలిచిందని తెలిపారు. సోలార్ గ్రిడ్ అనుసంధానం యూనిట్‌కు రూ.3,50, సోలార్ బ్యాటరీ స్టోరేజీకి మెగావాట్‌కు రూ.9.90 కోట్ చేసిందన్నారు. దీనిపై బుధవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సోలార్ గ్రిడ్ అనుసంధానానికి యూనిట్‌కు రూ.3.50 వసూలు చేయడం దేశంలో ఇది అతి తక్కువ ధర అని, ఇదో విప్లవాత్మకమైన అడుగని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీనిపై సిఎం మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలకు 1998లోనే ఆరంభించామన్నారు. సంస్కరణలంటే సామాన్యుడిపై భారం మోపేవిగా భావించేవారన్నారు. కాని ఈ ఆలోచన తప్పని నిరూపించామని, సంస్కరణలంటే సామాన్యుడికి వరమని నిరూపించామన్నారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ సూర్యోదయ రాష్ట్రంగా ఫోకస్ చేస్తున్నామని, దాన్ని నిజం చేస్తూ ఈరోజు ప్రతి గ్రామమూ సౌర విద్యుత్ కేంద్రంగా మారబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్టమ్రంతా సోలార్ ప్యానళ్లు కన్పించనున్నాయని, పైనున్న నల్లని మేఘాలు కిందకు దిగివచ్చాయా అనే రీతిలో రాష్ట్రం కన్పించనున్నదని వ్యాఖ్యానించారు.
ఇప్పటిదాకా విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ వినియోగదారుడిగా ఉన్న గ్రామీణులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేవారిగా మారిపోనున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, గృహ విద్యుత్‌కు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా మిగులు విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అందించే పారిశ్రామికవేత్తగా మారనున్నాడన్నారు. ఇలాఉంటే రాష్ట్ర విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి ఆశయం నెరవేరిందని భవిష్యత్‌లో కరెంటు చార్జీల భారం వినియోగదారులపై ఉండబోదని ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. 2018-19 వార్షిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్లుగా ఇంధన రంగం ఇలాగే పరుగులు పెడితే భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని అన్నారు.