ఆంధ్రప్రదేశ్‌

ఐలయ్య పుస్తకంపై ప్రభుత్వం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: వైశ్యులపై కంచె ఐలయ్య రాసిన పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. వైశ్యులు పలు ప్రాంతాల్లో అందోళనకు దిగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పుస్తకంపై సీరియస్ అయినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో డిజిపి సాంబశివరావు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఐలయ్య పుస్తకం, దాని వల్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల గురించి వివరించారు.