ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: ఇండియన్ నేవీ మిడ్ ఇయర్ రీఫిట్ రివ్యూ (ఎంవైఆర్‌ఆర్), మిడ్ ఇయర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రివ్యూ (ఎంవైఐఆర్) విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. రెండు రోజులపాటు జరిగే ఈ సమీక్షా సమావేశాలు చీఫ్ ఆఫ్ నేవల్ మెటీరియల్స్ వైస్ అడ్మిరల్ జిఎస్ పబ్బీ అధ్యక్షతన జరగనున్నాయి. నేవీకి చేందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌ల రీ ఫిట్ గురించి ఇందులో చర్చించారు. అలాగే భారత నౌకాదళంలో ఇప్పుడున్న వౌలిక సదుపాయాలతోపాటు, భవిష్యత్‌కు అవసరమైన సౌకర్యాల గురించి కూడా చర్చించారు. దేశంలోని వివిధ నేవల్ హెడ్‌క్వార్టర్స్ అధిపతులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పబ్బీ మాట్లాడుతూ నౌకలు, సబ్‌మెరైన్‌ల రీఫిటింగ్‌కు సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న రీఫిట్ షెడ్యూల్స్‌లో మార్పులు, చేర్పులపై సమావేశం క్షుణ్ణంగా చర్చించింది. భారత నౌకాదళానికి మరింతగా వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సమావేశం నిర్ణయించింది.

చిత్రం..విశాఖలో చీఫ్ ఆఫ్ నేవల్ మెటీరియల్స్ వైస్ అడ్మిరల్ జిఎస్ పబ్బీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగినప్పటి దృశ్యం