ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభం, సెప్టెంబర్ 12: మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా పిడుగు పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు ఆరా తీశారు. వారు అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బి.గుర్రమ్మ మంగళవారం ఉదయం చనిపోయింది. మృతదేహాన్ని అనంతవరం, గొల్లలపాలెం మధ్య ఉన్న శ్మశానవాటికకు సాయంత్రం గ్రామానికి చెందిన రొంగళి రమేష్ గోవింద్(35) కశిరెడ్డి గంగునాయుడు(35), మరి కొందరు తీసుకెళ్లారు. మృతదేహం కాలుతున్న సమయంలో వర్షం కురవడంతో రమేష్ గోవింద్, గంగునాయుడు, మరికొందరు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో వర్షంతోపాటు పిడుగు పడడంతో రమేష్‌గోవింద్, గంగునాయుడు అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు చెట్టుకింద ఉన్న మరో నలుగురు కె.బుచ్చిబాబు, ఎన్.గౌరినాయుడు, కె.కన్నంనాయుడు, ఎన్.ముత్యాలునాయుడు అస్వస్థకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. .