ఆంధ్రప్రదేశ్‌

15నుంచి స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) దినేష్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛ కార్యక్రమాలపై వెలగపూడి సచివాలయం నుంచి సిఎస్ దినేష్‌కుమార్ మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీన సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. 17, 24 తేదీల్లో అన్ని ప్రాంతాల్లోనూ శ్రమదానం చేయాలని అన్నారు. 25వ తేదీన ప్రజలతో కలిసి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, బహిరంగ మరుగుదొడ్లు, పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేయాలని చెప్పారు.