ఆంధ్రప్రదేశ్‌

కలిసి ఉందామా.. ఒంటరిగా వెళ్దామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 12: రానున్న 2019ఎన్నికల నాటికి తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయ. భారతీయ జనతాపార్టీ రాష్టప్రదాధికారుల సమావేశం ఒంగోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాపార్టీ అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యనేతలందరు చర్చించారు. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపరంగా ఏవిధంగా ఎన్నికల వ్యూహం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. అందులోభాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో ఆ పొత్తు అనే అంశంపై పదాధికారులు చర్చించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా పదాధికారులు పూర్తిస్ధాయిలో విశే్లషించినట్లు సమాచారం. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి తొమ్మిది స్ధానాలను తెలుగుదేశంపార్టీ అధిష్టానవర్గం కేటాయించి, అందులో కొన్నిచోట్ల తెలుగుదేశంపార్టీకి చెందినవారినే రెబల్స్‌గా పోటీలోకి దించారని అందువలన పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారన్న అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు సమాచారం. ఈనేపధ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉండవచ్చులేదా ఉండకపోవచ్చుననే అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్టస్ధ్రాయిలో పార్టీక్యాడర్‌తో తెలుగుదేశంపార్టీ నాయకులు తత్‌సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ జిల్లాల్లో మాత్రం బిజెపి నేతలతో తెలుగు తమ్ముళ్ళు సఖ్యతగా ఉండటం లేదన్న అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు బస్సు యాత్రను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేయాలని పదాధికారులు నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను రాష్ట్రప్రభుత్వం హైజాక్‌చేసి వారి పథకాలుగా మార్చుకుంటున్న విషయాలపై కూడా పదాధికారులు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల పేర్లను మార్చకుండా రాష్ట్రప్రభుత్వం అదే పేర్లతో ప్రవేశపెట్టాలని పదాధికారులు తీర్మానించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని నేతలు ముక్తకంఠంతో తీర్మానించారు. 2019ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పదాధికారులు అభిప్రాయానికి వచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా తరపునుండి కొన్ని సమస్యలను ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి రాష్ట్ర పదాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో వెలుగొండప్రాజెక్టును పూర్తిచేయాలని, అదేవిధంగా బత్తాయి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణారెడ్డి పదాధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటామని పదాధికారులు హామీ ఇచ్చారు. ఈరాష్టస్ధ్రాయి పదాధికారుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, అఖిలభారత పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీష్‌జి, రాష్టమ్రంత్రులు కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పార్లమెంటుసభ్యులు జి గంగరాజు, ఎంఎల్‌సిలు సోము వీర్రాజు, సత్యనారాయణ, మాధవ, శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, రాష్టప్రార్టీ నాయకులు కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు, ప్రకాశం జిల్లాపార్టీఅధ్యక్షులు పివి కృష్ణారెడ్డితోపాటు, 13జిల్లాల పార్టీ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.

చిత్రాలు...రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న అఖిల భారత బిజెపి సంఘటన్ కార్యదర్శి సతీష్‌జీ .. హాజరైన మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నేతలు