ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్ తీర్పు శుభపరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ అంగీకరిస్తూ తీర్పు ఇవ్వడం శుభపరిణామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అభివర్ణించారు. ఈ తీర్పు వల్ల అదనంగా 50 టిఎంసిల నీటిని వాడుకునే అవకాశం రాష్ట్రానికి కలిగిందన్నారు. చాలా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ ఈ నీటి వల్ల దాదాపు 5 లక్షల ఎకరాలను శ్రీకాకుళం జిల్లాలో స్థిరీకరణ చేసే అవకాశం కలుగుతుందన్నారు. అక్విడెక్ట్ నిర్మించడం ద్వారా వంశధార నీటిని ఇచ్ఛాపురం వరకూ తరలించే వీలు కలుగుతుందన్నారు. ఒడిశాకు, ఎపికి మరింత మంచి భవిష్యత్తు, ప్రయోజనం కలిగేలా తీర్పు వచ్చిందన్నారు. 1961లో నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదించారని, 1962లో రెండో దశ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారని గుర్తు చేశారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాకు చెందిన 106 ఎకరాల భూమి అవసరమన్నారు. ఇందుకు అవసరమైన నిధులను ఎపి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ బ్యారేజీ నిర్మా ణం ద్వారా వచ్చే ఆయకట్టు ఆధారంగా నిర్మాణ ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. 50 టిఎంసి నీటి వల్ల ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా మాదిరిగా శ్రీకాకుళం జిల్లా తయారవుతుందన్నారు. హిరమండలం రిజర్వాయరులో 19 టిఎంసిల నీటిని నిలువ చేసే వీలుందన్నారు. వంశధార, నాగావళి నదులను కూడా అనుసంధానం చేసే వీలు ఈ తీర్పు వల్ల కలిగిందన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని చెరో 50 టిఎంసిలు వాడుకునే వీలు కలిగిందన్నారు. హిరమండలం రిజర్వాయరును వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. వంశధార నీటిని ఇచ్ఛాపురం తరలించేందుకు 1100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఒడిశా ప్రభుత్వాన్ని కలిసి రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా మాట్లాడతానన్నారు. జిఎస్‌టి వల్ల సాగునీటి ప్రాజెక్టులపై భారం పడుతోందన్నారు. ఈ విషయాన్ని జిఎస్‌టి కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. గోదావరి జలాలు గురువారం వరకూ 758 టిఎంసి మేర సముద్రంలో కలిశాయన్నారు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి పోలవరం పనుల్లో జాప్యంపై నోటీసు ఇచ్చామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
డిజైన్ ఖరారయ్యాకే పనులు ప్రారంభం
అమరావతి రాజధానిలో హైకోర్టు, అసెంబ్లీ తదితర భవనాల డిజైన్లు ఖరారయ్యాకే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచంలో మేటి భవనాల్లో ఒకటిగా గుర్తింపు రావాలని తాను భావిస్తున్నానని, అటువంటి భవనాల నిర్మాణానికి తొందరపడనని స్పష్టం చేశారు. నార్మన్-్ఫస్టర్ సంస్థ అందించిన డిజైన్లపై రెండు రోజులు చర్చించామన్నారు. ఇంకా మరింతగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఈ విషయమై సినీ దర్శకుడు రాజవౌళి సూచనలు తీసుకోమని అధికారులకు సూచించానన్నారు. అవసరమైతే లండన్ కూడా పంపేందుకు సిద్ధమన్నారు. సంస్కృతిక వారసత్వం తెలియచేసేలా కల్చరల్ కాంప్లెక్సును కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రతిపక్షానికి ఏమీ పని లేదని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు పక్కన పెట్టారన్నారు. అమరావతి నిర్మాణం జరుగకుండా ఇప్పటికీ అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం నుంచి ప్యాకేజీ కింద 13 వేల రూపాయల వరకూ రావాల్సి ఉందన్నారు.
నేను అలా అనలేదు
వచ్చే ఎన్నికల్లో టిడిపి 175 సీట్లు గెలుస్తుందని తాను ఎప్పుడూ అనలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సిఎం తెలిపారు. పాలన ద్వారా ప్రజల్లో 80 శాతం సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో ఓటరు టిడిపికి చేరువ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. పాలన ద్వారా ప్రజలను తమవైపు కన్‌సాలిడేషన్ అయ్యేలా చూస్తున్నామని వివరించారు. రాజకీయాల్లో కొత్త విధానాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. పక్కన మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, అఖిలప్రియ