ఆంధ్రప్రదేశ్‌

సమ్మిళిత వృద్ధి.. సర్వతోముఖాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: సుస్థిర సమ్మిళిత వృద్ధి, అన్ని రంగాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలుగా శుక్రవారం సచివాలయంలో శాఖాధిపతుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రతి త్రైమాసానికి ఒకసారి 13 జిల్లాల కలెక్టర్లతో రెండు రోజులపాటు సదస్సును నిర్వహిస్తున్న ప్రభుత్వం దానికి కొన్ని రోజుల ముందే శాఖాధిపతుల సమావేశాన్ని జరిపి ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించడం రివాజు. ఈసారి నిర్వహించే సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ శాఖలలో జవాబుదారీతనం, సామర్థ్యం మరింత పెంచుకోవాలని ఇటీవలి సమీక్ష సమావేశాలలో చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో అందుకు తగిన ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అధికారి జవాబుదారీగా ఉంటూ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఉత్తేజితుల్ని చేయగలిగిన నాడే ప్రభుత్వ లక్ష్యాలను వేగంగా చేరుకోవడం సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. దాన్ని సాధించడానికి నిర్దేశిత అభివృద్ధి సూచికల ఆధారంగా పనిచేయాలంటున్న ముఖ్యమంత్రి ఆ మేరకు అవసరమైన కొలమానాలేమిటో ఈ సమావేశంలో వివరించనున్నారు. అధికారులందరూ ఆర్థిక ఫలితాలు, నివేదికలపై అధ్యయనం చేసి అవగాహన పెంచుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి జిఎస్‌డిపిలో ఏఏ శాఖల వాటా ఎంత వుందో ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. రెండంకెల వృద్ధి, సమ్మిళిత వృద్ధి అంశాలలో మనం ఎంతమేరకు ఫలితాలు సాధించామో, ఎక్కడ వెనుకబడ్డామో ఆర్థిక, ప్రణాళికా శాఖల నిపుణులు ఈ సమావేశంలో విశే్లషించి చెబుతారు. అలాగే, గత సమావేశాలలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, పనితీరు సూచికలపై సమష్టిగా కూర్చుని చర్చిస్తారు.
150 ప్రభుత్వ శాఖలు, 33 కార్యదర్శుల కార్యస్థానాలు, 20 మంత్రిత్వ శాఖలు, ఇంకా వివిధ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు, వీటన్నింటిలో అత్యున్నత ప్రమాణాల సాధన కోసం కొన్ని కొలమానాలు, ప్రణాళికలు, అభివృద్ధి సూచికలను ప్రభుత్వం నిర్దేశించనున్నది. ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ మిషన్ అప్రోచ్‌తో ముందుకు వెళ్లినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటామని బాబు తరచూ చెబుతున్నారు. 7 రంగాలను గత సమావేశాలలో గ్రోత్ ఇంజన్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఆయా రంగాలలో ఎంతమేర అభివృద్ధి సాధించామో ఈ సమావేశంలో అంచనా వేయనున్నారు. నీతి అయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు, రాష్ట్రం నిర్ణయించుకున్న లక్ష్యాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదీ విశే్లషిస్తారు. తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఈ సమావేశం తగిన మార్గదర్శనం చేస్తుంది. తక్కువ తలసరి ఆదాయం వున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. సుస్థిర వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా గ్రోత్ ఇంజన్లుగా గుర్తించిన రంగాలలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గత సమావేశాల్లో సూచించారు.
ఈ సమావేశాల్లో తొలి త్రైమాసిక ప్రగతిపై చర్చలతో పాటు గ్రోత్ ఇంజన్స్ కార్యాంశాలు, శాఖలవారీ పనితీరు, కేంద్ర ప్రభుత్వ నిధులు, వినియోగం, ఆర్‌ఐడిఎఫ్, ఈఏపీ, కేంద్ర కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళిక కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి ప్రసంగిస్తారు. సుస్థిర రెండంకెల వృద్ధి, సమాజ వికాసం, కుటుంబ వికాసం, జీవీఎ, కెపిఐ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.