ఆంధ్రప్రదేశ్‌

మంటలు ఆర్పని సర్కార్ నిర్లిప్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: అగ్ని ప్రమాదాల సమయంలోనే కాకుండా, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ క్రీయాశీలక పాత్ర వహించే అగ్నిమాపక శాఖలోని ఖాళీ పోస్టుల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీన వైఖరి అవలంబిస్తోం ది. మంజూరైన పోస్టులను కూడా భర్తీ చేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 173 ఫైర్ స్టేషన్‌లుంటే 170 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించి, మొత్తంపై 55 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపినప్పటికీ, గత కొన్ని మాసాలుగా దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉంది. ఆ ఫైల్ చేతికి అందితేగాని నోటిఫికేషన్ జారీ సాధ్యంకాదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమశాఖలోని ఖాళీల భర్తీకి సంబంధించి అగ్నిమాపక శాఖ డిజి నోటిఫికేషన్ ఇస్తుండే వారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆ బాధ్యత అప్పగించారు. బోర్డు అధికారులు ఆ ఫైలును పరిశీలించి భర్తీ అధికారమిచ్చే జీవో అగ్నిమాపక శాఖకు అనుకూలంగా ఉంటే.. ఉద్యోగాల భర్తీ రిస్క్ మాపై ఎందుకు అంటూ ఆ ఫైల్‌ను వెనక్కి పం పించారు.ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రస్తుతానికి 55 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది కానీ, నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. పనిలోపనిగా మొత్తం 170 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక కానిస్టేబుళ్ల పోస్టులు 600 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2900 పోస్టులకుగాను 2300 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కానిస్టేబుళ్ల పోస్టుల ఖాళీల భర్తీపై స్పందించడంలేదు. డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నుంచి అనుమతి వచ్చి నోటిఫికేషన్ జారీ అయి నియామకా లు పూర్తయి వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చేలోపు.. ఆర్టీసీలో అదనంగా ఉన్న డ్రైవర్లను తమకు కేటాయించాలంటూ అగ్నిమాపక శాఖ పంపిన ప్రతిపాదన కూడా ఆర్టీసీలో పెండింగ్‌లో ఉంది. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా క్షణా ల్లో ఘటనా స్థలానికి చేరుకుని నష్ట నివారణా చర్యలు తీసుకోవాల్సిన అగ్నిమాపక శాఖలో కీలకమైన దిగువ స్థాయి పోస్టులు భర్తీ చేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.