ఆంధ్రప్రదేశ్‌

ఫౌండేషన్ కోర్సుపై అధ్యయనానికి తమిళనాడు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ స్కూళ్లలో గత రెండు సంవత్సరాలుగా అమలుచేస్తున్న ఫౌండేషన్ కోర్సుపై అధ్యయనానికి తమిళనాడు ప్రభుత్వ బృందం అమరావతికి వచ్చి, పురపాలక మంత్రి నారాయణను కలిసి చర్చించింది. అలాగే మున్సిపల్ స్కూళ్లను సందర్శించింది. పిల్లలతో, వారి తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఇప్పటివరకు తమిళనాడులో ప్లస్ టు (ఇంటర్) మార్కుల ఆధారంగా మెడిసిన్ సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నుండి నీట్ ద్వారా మెడికల్ సీట్లు దేశ వ్యాప్తంగా భర్తీ చేసే ప్రక్రియ అమల్లోకి రావడంతో తమిళనాడు విద్యార్థులు నీట్ ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది. కాని నీట్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడాల్సి రావడంతో తమిళ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యా ప్రమాణాలను బలోపేతం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు బృందం ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ స్కూళ్లలో అమలు జరుగుతున్న ఫౌండేషన్ కోర్సును తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణను కలిసి చర్చించింది. తమ రాష్ట్రంలో ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టడానికి మంత్రి నుండి సలహాలను కోరింది. ఈ అంశంలో తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన బృందంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నరేష్, హైయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నీలకంఠన్ ఉన్నారు.