ఆంధ్రప్రదేశ్‌

ఈపిడిసిఎల్ సిఎండిగా దొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: ఎపి ఈపిడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా హెచ్‌వై దొర నియమితులయ్యారు. డిస్కం సిఎండిగా దొరను నియమిస్తూ ఇంధన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిస్కం సిఎండిగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తారు. దొర 1978లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎపిఎస్‌ఇబిలో చేరారు. తరువాత 1991లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా, 2001 జూలైలో డివిజనల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2006 మేలో పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఎపిఈపిడిసిఎల్ పరిధిలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విధులు నిర్వహించారు. తరువాత 2007లో చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందిన దొర చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా విధులు నిర్వహించేవారు. ఈ విధంగా విశాఖలో సుమారు 25 ఏళ్ళపాటు వివిధ హోదాల్లో సంస్థకు సేవలందిస్తూ 2008 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం 2008 మే 1న ఎపిఈపిడిసిఎల్ డైరెక్టర్‌గా నియమితులై, ప్రాజెక్ట్స్, కమర్షియల్, హెచ్‌ఆర్‌డి, ఆపరేషన్స్ విభాగాలకు చెందిన బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించగలిగారు. 2013 సెప్టెంబర్ 1 నుంచి ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వచ్చి ద ఆగస్టు 31 వరకు ఇదే హోదాలో సేవలందించారు.