ఆంధ్రప్రదేశ్‌

మెడపై కత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 14: కుటుంబ గొడవల నేపధ్యంలో ఓ వ్యక్తి మెడపై కత్తితో దాడి చేశారు. మెడపై గుచ్చుకున్న కత్తితో బాధితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు. అనంతపురంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ధర్మవరానికి చెందిన రాంప్రసాద్, కళ్యాణ విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. గురువారం కేసు వాయిదాకు హాజరైన రాంప్రసాద్ మోటార్‌సైకిల్‌పై సోదరుడి ఇంటికి వెళ్తుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకుని కత్తితో దాడి చేశారు. దీంతో కత్తి రాంప్రసాద్ మెడలో గుచ్చుకుంది. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని బెంగళూరుకు తరలించారు. భార్య తరఫువారే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.