ఆంధ్రప్రదేశ్‌

భూగర్భ జలాలు పెంపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడానికి వివిధ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లయితే వాటిని అమలుచేసి భూగర్భ జల వనరులను పెంచటానికి తగిన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. గురువారం విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో భూగర్భ జలాల రీ-ఎస్టిమేషన్‌పై మొదటి రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షా సమావేశాన్ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (జీవోఐ), గ్రౌండ్ వాటర్, వాటర్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ (జీవోఏపి)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీనికి రాష్టస్థ్రాయిలో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్‌ల నుంచి 23 మంది కమిటీ సభ్యులు (జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, రూరల్ వాటర్ సప్లై, మైనర్ ఇరిగేషన్ శాఖలు) హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ రివ్యూలో అధికారులు భూగర్భ జలాల వనరులు పెరగడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలపై మంత్రికి స్లైడ్స్ ద్వారా వివరించారు. అదే విధంగా అధికారులకు మంత్రి రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపుదలకు తీసుకోవలసిన చర్యలను ఈ సందర్భంగా సూచించారు. స్వర్ణముఖి, పెన్నార్, చింతలపూడి శాండ్ స్టోన్ ప్రాంతాల్లో రీఛార్జి ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి పంపించాలని కమిటీకి సూచించారు. భూగర్భ జలాలు చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆశించినంతగా లేవని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. అందులో భాగంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఫామ్ పాండ్స్ నిర్మాణం, వనం-మనం, నీరు-ప్రగతి కింద అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఉపరితలంలో పడిన జలాలు భూగర్భ జలాలుగా మరల్చేందుకు దోహదపడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో కొత్త సాంకేతిక విధానాలను ఉపయోగించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరువు పరిస్థితులు అంచనా వేయటానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ బ్లాక్, జిల్లా, రాష్టస్థ్రాయిల్లో భూగర్భ జల వనరులు ఎలా ఉన్నాయో పరిశీలించటానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఈ కమిటీ దేశవ్యాప్తంగా పరిశీలించి నివేదికను ఇస్తుందన్నారు. భూగర్భ జలాల వనరులు ఎక్కడ ఎక్కువగా వాడకం జరిగింది, క్రిటికల్, సెమీ క్రిటికల్, సేఫ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తారన్నారు. మెంబర్ సెక్రటరీ, రీజనల్ డైరక్టర్, సదరన్ రీజియన్ (సిజిడబ్ల్యుబి) సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయటానికి తీసుకోవాల్సిన చర్యలను సాధ్యమైనంత త్వరగా చేస్తామని తెలిపారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దేవినేని