ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 14: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి వద్ద అదుపుతప్పిన స్కార్పియో వాహనం మురుగు కాలువలోకి దూసుకుపోయి, బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి సహా ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన కుటుంబం కొవ్వలిలో ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పక్కనే ఉన్న మురుగుకాలువలోకి దూసుకుపోయి, బోల్తాపడింది. ఈప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నాల లక్ష్మి(55), చిన్నాల ధన్యాశ్రీ(2), చిన్నాల దేవి(25), చిన్నాల విజయలక్ష్మి(55), చిన్నాల సులోచన(62), చిన్నాల కుమారి(50) అక్కడికక్కడే మృతిచెందారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నాల లక్ష్మి, చిన్నషణ్ముఖ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనం అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా ఈప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం తెల్సిన వెంటనే జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరు పి కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.