ఆంధ్రప్రదేశ్‌

రాగాల సోదరులకు పదేసి లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: ఇటీవల జరిగిన కామనె్వల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన విజయనగరం జిల్లా కొండవెలగాడు గ్రామానికి చెందిన సంతోషి, గుంటూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు రాగాల వరుణ్, రాహుల్‌ను గురువారం సత్కరించారు. వీరికి పది లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. వీరికి కోచ్‌గా వ్యవహరించిన మాణిక్యాలరావుకు కూడా ఐదు లక్షల రూపాయల నగదును ప్రోత్సాహకంగా ప్రకటించారు. సంతోషికి కూడా 10 లక్షల రూపాయల ప్రోత్సాహం ప్రకటించారు. వరుణ్, రాహుల్‌ల తండ్రికి రెండెకరాల స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ చూపే విధంగా శిక్షణకు అవసరమైన సౌకర్యాలతో కోచ్‌లను నియమించాలని అధికారులను ఆదేశించారు. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్రానికి పేరు తెచ్చిన వీరిని ప్రోత్సహించటం బాధ్యతగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చిత్రం..కామనె్వల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు