ఆంధ్రప్రదేశ్‌

వినూత్న ప్రాజెక్టులతోనే పర్యాటకానికి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినూత్న ప్రాజెక్టులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టు ఏపీని పర్యాటకులకు స్వర్గ్ధామంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో జరిపిన ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్, హెరిటేజ్ బోర్డు సమావేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియతో కలిసి అధికారులతో చర్చించారు. విజయవాడలో కళాక్షేత్రం ఆడిటోరియం, పవిత్ర సంగమం దగ్గర గ్రాండ్ ధియేటర్ నిర్మాణం, అనంతపురం జిల్లాలో ఎఫ్ 3 రేస్ సర్క్యూట్ ఏర్పాటు, కొండపల్లి కోట, రాజమహేంద్రవరంలో హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకశాఖ కోసం ఆరు కొతత లోగోలను అధికారులు ముందుంచగా ముఖ్యమంత్రి వాటిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా, మన సంస్కృతిని ప్రతిబింబించేలా లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించాలని చెప్పారు. అనంతపురం జిల్లాకు ఎఫ్ 3 రేసింగ్ సర్క్యూటు రానుంది. తనకల్లు మండలం కోటపల్లిలో 3.2 కిమీ పొడవైన రేసింగ్ ట్రాకుతో పాటు ఆటోమోటివ్ థీమ్ పార్కు, విలాసవంతమైన రిసార్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ నుంచి పర్యాటకులను ఆకట్టుకునేలా 245 ఎకరాల పరిధిలో ‘నిధి మార్క్ వన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దీని ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. ఏడాదిన్నరలోనే మొదటిదశ ప్రాజెక్టు పూర్తి చేస్తామని నిధి సంస్థ వెల్లడించింది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న కొండపల్లి కోటను తర్చీదిద్దడంలో భాగంగా కొండపల్లి ఎకో మ్యూజియం, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న కోటను, పరిసరాలను సుందరంగా మలచనుంది. కొండపల్లి బొమ్మలకు సైతం ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టనుంది. కొండపల్లి ఖిల్లా ఉన్న సుమారు 400 ఎకరాల అటవీ భూమిని అవసరమైతే డీనోటిఫై చేసి అభివృద్ధిపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లాలోని కంగుండి, గుంటూరు జిల్లాలోని కొండవీడు, బెల్లంకొండ, అనంతపురం జిల్లాలోని కుందుర్పి కోటలతో సహా అన్ని జిల్లాల్లోని కోటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వీటికి ఒక్కోదానికి రూ.2 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వ్యయమవుతుందని వెల్లడించారు. విజయవాడలోని జివిఆర్ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలోని 3.06 ఎకరాల విస్తీర్ణంలో ‘కళాక్షేత్ర ఆడిటోరియం’ త్వరలో నిర్మితం కానుంది. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర నదీ ముఖంగా అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ థియేటర్ కొలువుదీరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 100 ఏళ్లనాటి రాజమహేంద్రవరం-కొవ్వూరు రైల్వే వంతెనను పర్యాటకరంగ అభివృద్ధి కోసం వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందన్నారు.తిరుపతిలో ట్రావెల్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిన జామ్ కార్స్ సంస్థను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్వాగతించారు.
రాష్ట్రంలో హాస్పిటాలిటీ వర్సిటీ
రాష్ట్రంలో హాస్పిటాలిటీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ వంటకాలు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేందుకు సమగ్ర విధానాన్ని అవలంభిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే నోరూరించే రుచులతో ఆహారం పర్యాటకులకు అందజేయుటకు కూడా ప్రతిపాదించామని తెలిపారు. సుదీర్ఘ సముద్రతీరం, చారిత్రక కట్టడాలు, పోలవరం, పాపికొండలు, అరకు వంటి ప్రాంతాలు పర్యాటకులను అలరిస్తాయని తెలిపారు. అనంతరం పర్యాటకశాఖ 30 రకాల వంటకాల ప్రదర్శన ఆకట్టుకుంది.