ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌సిపి ఒప్పందాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్‌సిఇపి) వంటి ఒప్పందాలతో దేశ ప్రజలపై దోపిడీ మరింత తీవ్రమవుతుందని ‘జనశక్తి’ సంపాదకుడు పి జస్వంతరావు అన్నారు. ఏఐఎఫ్‌టియు (న్యూ), రైతుకూలీ సంఘం (ఆం.ప్ర), నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నగరంలోని కందుకూరి కల్యాణ మండపంలో కార్మిక, రైతుకూలీ, యువజనుల రాష్టస్థ్రాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మూడు సంస్థల ప్రతినిధులు సి పెద్దన్న, డి వర్మ, ఎల్ లక్ష్మీరెడ్డి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జస్వంతరావు ప్రారంభోపన్యాసం చేస్తూ సామ్రాజ్యవాదులు భోజనాల బల్ల వద్ద విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి దేశ పాలకులు ప్రజానీకంపై పెనుభారాలు మోపేందుకు సిద్ధవౌతున్నారని ఆరోపించారు. ఆర్‌సిఇపి అమల్లోకి వస్తే 80 శాతం సరుకులపై దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దుచేయాలని, దీంతో భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పూర్తిగా కుదేలై సంక్షోభం మరింత తీవ్రవౌతుందన్నారు. గోధుమలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో ‘బంగీ’ కంపెనీ 5 లక్షల టన్నుల గోధుమలను విదేశాల నుండి కొనుగోలు చేసిందని, దేశంలో పండించిన పంట అమ్ముడుపోక వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరుగుతుందని చెప్పారు. సదస్సులో ఎఐఎఫ్‌టియు జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ, ఎఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి జె కిషోర్‌బాబు, రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె కోటయ్య, నవయువ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కె బాషా కూడా ప్రసంగించారు. ఈసందర్భంగా నగర వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.