ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి, స్టాన్‌ఫోర్డ్‌కు మధ్య వారధిగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్‌కేర్ విభాగంలో ప్రొఫెసర్‌గా అవకాశం దక్కించుకున్న గుంటూరు నగరంలోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉన్నత స్థాయికి ఎదిగి తెలుగుజాతి ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన కార్తీక్‌ను ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. అమరావతిలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్‌కేర్ విభాగానికి మధ్య వారధిగా ఉండాలని, భవిష్యత్‌లో అలాంటి సేవలను ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని కార్తీక్‌కు చంద్రబాబు సూచించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తిచేసిన కార్తీక్ న్యూయార్క్‌లోని విల్ కార్నెల్ వైద్య కళాశాలలో ఏడాది పాటు ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో వాస్క్యులర్ సర్జరీలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేశారు. వర్సిటీలోని వాస్క్యులర్ సర్జికల్ విభాగంలో అమెరికాయేతర వైద్యునిగా ఏపికి చెందిన కార్తీక్ ఎంపిక కావడం అరుదైన అవకాశమని చంద్రబాబు ఆయనను అభినందించారు.