ఆంధ్రప్రదేశ్‌

ఏపీలోనూ తెలంగాణదే హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడిచినా ఏపిలో ఇంకా తెలంగాణ హవా కొనసాగుతుండటంపై అధికారులు, అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కీలకమైన అసెంబ్లీ కార్యదర్శి నియామకంపై ఆంధ్ర ఉద్యోగులు, అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పదవికి అర్హులైన ఆంధ్ర అధికారులున్నప్పటికీ, ప్రభుత్వం తెలంగాణకు చెందిన అధికారిని నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అసెంబ్లీ ఉద్యోగులు, అధికారులు నిరసన తెలుపుతున్నారు. ఇటీవలి కాలం వరకూ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు కార్యాలయంలో చేరడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. అయితే రామాచార్యులు ఢిల్లీకి వెళ్లే ముందు ఎవరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించక పోవడంతో ప్రస్తుతం అసెంబ్లీకి కార్యదర్శి అంటూ లేకుండా పోయారు. అంతకుముందు వరకూ ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సత్యనారాయణ ఉన్నప్పటికీ ఆయనకూ బాధ్యతలు ఇవ్వలేదు. కాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సర్వీసుతో సంబంధం లేకుండా ప్రసారభారతి ఉద్యోగి అయిన ప్రసన్న, నాటి సిపిఎం నేత సోమనాథ్ చటర్జీ స్పీకర్‌గా ఉన్న సమయంలో లోక్‌సభ, రాజ్యసభ నుంచి ప్రసారభారతికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాల బాధ్యతలు చూసేవారు. ఖమ్మం జిల్లా సిపిఎం ప్రముఖుడొకరు అప్పుడు ఈవిషయంలో చొరవ చూపారనే ప్రచారం జరిగింది. తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రసన్నను పిలిచి ఢిల్లీ అసెంబ్లీలో నియమించారు. మళ్లీ ఇప్పుడు ప్రసన్నను ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఏపికి తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో లాబీయింగ్ నడిపారని, కేవలం సామాజికవర్గ కోణంలోనే ఏపికి తీసుకొస్తున్నారని అసెంబ్లీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక కేంద్ర మంత్రితో పాటు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు కూడా తమ బంధువైన ఆయనను ఏపి అసెంబ్లీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆ పదవికి ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న సత్యనారాయణతో పాటు లా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అర్హులని, అయినా వారిద్దరినీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సత్యనారాయణ రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్ల పాటు ఇన్చార్జిగా వ్యవహరించారు.
లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్న వారికే లేని లా అర్హత అసెంబ్లీకి వర్తింపచేయడం వల్ల సత్యనారాయణ పూర్తిస్థాయి కార్యదర్శి కాలేకపోయారు. డిప్యూటీ సెక్రటరీలుగా ఉన్న విజయరాజు, బాలకృష్ణమాచార్యులకు ఇప్పటివరకూ జా యింట్ సెక్రటరీ ప్రమోషన్ ఇవ్వకపోవడంతో వారికీ కార్యదర్శి హోదా దక్కకుండాపోయింది. ప్రసన్నపై బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసారభారతి అధికారిగా పదేళ్లపాటు డిప్యూటేషన్‌పై పనిచేసిన ఆయనను తిరిగి విధుల్లో చేరాలంటూ ప్రసారభారతి యాజమాన్యం నోటీసు ఇచ్చింది. అయితే దాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అది ఇంకా పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు తెలంగాణలో ఇబ్బందులు పడుతుంటే, తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణకు చెందినవారిని కేవలం సామాజిక కోణంలో నియామకాలు చేస్తుండటంపై ఉద్యోగులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రసన్నకుమార్ నియామక యత్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఉద్యోగులు సంఘం కొద్దిరోజుల క్రితం రిలీవైన రామాచార్యులును కలసి వినతిపత్రం అందజేసింది. తెలంగాణ అధికారి పర్యవేక్షణలో తాము పనిచేయలేమని ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రసన్నను నియమించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే సామూహిక సెలవు, పెన్‌డౌన్ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అసెంబ్లీ ఉద్యోగులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆలయ పాలకవర్గాల్లోనూ తెలంగాణ నేతలను నియమిస్తుండటంపై రాష్ట్ర టిడిపి నాయకుల్లో అసంతృప్తి వ్యక్తవౌతోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఒక సామాజికవర్గం వారు తమ అవకాశాలు దెబ్బతీస్తున్నారని స్థానిక ఉద్యోగులు, పార్టీ నాయకులు ఉడికిపోతున్నారు.