ఆంధ్రప్రదేశ్‌

ఆధ్యాత్మిక శక్తే శాశ్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 16: అందం, అధికారం, ఐశ్వర్యం అశాశ్వతమని, కేవలం ఆధ్యాత్మిక శక్తే శాశ్వతమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. టిఎస్సాఆర్ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం శనివారం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తి అని, కళాకారులను ప్రేమించాలన్నారు. ఎంతమందికి తాను ఉపయోగపడ్డానన్నదే ముఖ్యమని, ఆఖరి శ్వాస వరకు తోటిమనిషిని ప్రేమించాలని, అసూయ, ద్వేషాలకు దూరంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. ఈశ్వర శక్తితోనే తాను పార్లమెంట్‌లో ఇన్నాళ్ళు ఉండగలిగానన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈశ్వరుడు, వెంకటేశ్వరస్వామి, హనుమాన్ స్తోత్రాలను పఠించి భక్తులను సమ్మోహితులను చేశారు. శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అభిభాషిస్తూ సుబ్బరామిరెడ్డి రాజకీయవేత్తగా, పారిశ్రామికవేత్తగానే కాకుండా ఆధ్యాత్మికవేత్తగానే తాను చూస్తున్నానన్నారు. అష్టాదశ పీఠాలు, జ్యోతిర్లింగాల ఆరాధనతో టిఎస్సాఆర్ ప్రతి ఏడాది విశాఖ ప్రజల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఎపిలో విశాఖ సుందర నగరమని, ప్రతిఏటా శివరాత్రికి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుంచి నగరాన్ని కాపాడుతున్నారన్నారు. మూడేళ్ళ తరువాత మళ్ళీతాను సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు చెప్పారు. నగరంలో రాజకీయ నాయకుల వైఖరిపట్ల విరక్తి వస్తోందని, చేప్పేదొకటి, చేసేది మరొకటిగా ఉంటున్నాయన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ముక్కాముల క్షేత్రం పీఠాధిపతి పరమపూజ్య శ్రీ్ధర్‌స్వామిజీ సుబ్బరామిరెడ్డికి భైరవ రక్షణ కలగాలంటూ మహాభైరవ దండాన్ని తన అఖండ తపస్సుశక్తితో అందజేశారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రముఖుల అష్టాదశ పీఠాలు, జ్యోతిర్లింగాల ఆరాధకులకు సముచితంగా సత్కరించారు. ఇందులో పండిట్ శేషభట్టార్ సుదర్శనాచార్య, టిటిడి ప్రధానార్చకులు ఎపి శ్రీనివాసమూర్తిదీక్షితులు, భద్రాద్రి ముఖ్య అర్చకస్వామి కె.గోపాలకృష్ణమాచార్యులు, శ్రీశైలం ప్రధాన అర్చకులు పండిట్ మఠం రాచయ్యస్వామి, కాంచీపురం దేవస్థానం నుంచి పండిట్ ఎన్.గోపాలకృష్ణశాస్ర్తీ, మధురై ముఖ్య అర్చకస్వామి సుందర్‌భట్టార్, వారణాసి ప్రధాన అర్చకులు మురళీధర్ గణేశ్వర్ పట్వర్దన్ తదితర ప్రముఖులకు సుబ్బరామిరెడ్డి ఘనంగా సత్కరించారు. సుమారు 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవలందిస్తున్న డాక్టర్ కె.్ధర్మారావుకు స్వర్ణ కంకణాన్ని సుబ్బరామిరెడ్డి బహూకరించారు. వీరితోపాటు అలనాటి నటీమణులు జమున, వాణిశ్రీ, శారద, కాంచన, రాజశ్రీ, గాయనీమణులు పి.సుశీల, కె.జమునారాణి తమ అనుభూతులు పంచుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి సామాజిక సేవలను కొనియాడారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపి సుబ్బరామిరెడ్డి