ఆంధ్రప్రదేశ్‌

వాగులో పడిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, సెప్టెంబర్ 16: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా సంజామల మండలంలో శనివారం జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం కోవెలకుంట్ల నుంచి తాడిపత్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు (నెం. ఎపి 29 జడ్ 2505) పాలేరు వాగు వద్దకు చేరుకుంది. రోడ్డుపై మోకాళ్ల ఎత్తున నీరు పారుతుండడంతో డ్రైవర్ దావీద్ జాగ్రత్తగా బస్సును ముందుకు పోనిచ్చాడు. అయితే మధ్యలోకి వెళ్లిన తరువాత రోడ్డు కనిపించకపోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు దిగి వాగులో బోల్తాపడింది. దీంతో అందులోని 80 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొంతమంది బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తరలించారు. సుంకమ్మ, ఎస్తేరమ్మకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
వాగులో కొట్టుకుపోయిన వృద్ధురాలు
కొలిమిగుండ: వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అబ్దుల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన ఈడిగ రంగమ్మ(60) శుక్రవారం సాయంత్రం మేకలను ఇంటికి తోలుకొస్తుండగా మార్గమధ్యంలో ఉన్న వాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయింది. మేకలు ఇంటికి చేరినా రంగమ్మ రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. శనివారం ఉదయం వాగులోని ముళ్లకంపల్లో చిక్కుకున్న రంగమ్మ మృతదేహం కనిపించింది.