ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో బలపడే దిశగా బిజెపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 17 : కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో దశాబ్దాలుగా బలపడని బిజెపి రానున్న ఎన్నికల సమయానికి బలోపేతం కావడానికి పావులు కదుపుతోంది. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న తెలుగుదేశం పార్టీతో 2019 ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో బిజెపి ఇప్పటికే సంస్థాగతంగా పలు చర్యలు చేపట్టి, సభ్యత్వ నమోదుతో పాటు బూత్ స్థాయి నుంచి నియామకాలు చేపట్టింది. ఈక్రమంలో ఈసారి ఎంపి, ఎమ్మెల్యే స్థానాలను టిడిపి పొత్తుతో అత్యధికంగా పొందేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఏపిలో మొత్తం 25 ఎంపి స్థానాల్లో 2014 ఎన్నికల్లో నర్సాపురం, విశాఖపట్నం స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, మిగిలిన 23 స్థానాల్లో 2019 ఎన్నికల్లో కనీసం 15 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందని సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాయలసీమ నుంచి అనంతపురం జిల్లాలోని హిందూపురం, కడపలో రాజంపేట, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి ఎంపి స్థానాలను ఆశిస్తోంది. అలాగే 175 ఎమ్మెల్యే స్థానంలో 50కి పైగా సీట్లకు బేరం పెట్టి వీలైనన్ని ఎక్కువగా తీసుకోవాలని చూస్తోంది. ఈక్రమంలోనే అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎంపి స్థానాన్ని తనకు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి పురంధ్రేశ్వరి పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జిల్లాలో ఎమ్మెల్యే స్థానాల్లో ఏడింటికి ప్రతిపాదనలు పెట్టి రెండు, మూడైనా పొంది, టిడిపి సహకారంలో గెలిచేందుకు వ్యూహరచన చేస్తోంది. హిందూపురం ఎంపి స్థానాన్ని పురంధ్రేశ్వరి ఆశించడం వెనుక సిఎం చంద్రబాబును ఇరకాటంలో పెట్టడంతో పాటు హిందూపురంలో ఎన్టీఆర్‌పై ఆదరాభిమానాలు చూపే ప్రజలు, ఓటర్లు ఉండటం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపి సీటు ఆశించినా చంద్రబాబు వైఎస్‌ఆర్ కడప జిల్లా రాజంపేటను కేటాయించారు. అక్కడ ఎలాగూ టిడిపి ఓటమి పాలవుతుందని ముందే తెలిసిన చంద్రబాబు తనను ఉద్దేశపూర్వకంగానే అక్కడికి పంపించారని, ఇప్పుడు తాను హిందూపురం నుంచి టికెట్ పొంది వ్యక్తిగతంగా కక్ష సాధించాలన్నదే పురంధ్రేశ్వరి వ్యూహమని బిజెపి వర్గాల భావిస్తున్నాయి. అంతేకాకుండా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టిడిపి బలంగా ఉండటంతో తన గెలుపు సులభమవుతుందన్న భావన కూడా ఆమెలో ఉన్నట్లు సమాచారం. కాగా ఓవైపు అనంతపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడం, ఇప్పుడు పురంధ్రేశ్వరి హిందూపురం నుంచి ఎంపిగా రంగంలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకోవడం, కాంగ్రెస్ పుట్టగతులు లేకుండాపోవడం, టిడిపి, బిజెపిల మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు ఆసక్తిగా మారే అవకాశం ఉండటంతో రాజకీయం రసకందాయంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.