ఆంధ్రప్రదేశ్‌

వైకాపాతో బహిరంగ చర్చకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల ఫలితాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్ష వైసిపి నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు లెక్చరర్ల అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని తెలుగునాడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి విమర్శించారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీసులను ఇప్పటికే ప్రభుత్వం పొడిగించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను 50 శాతం మేర పెంచిందని, ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ. 200 కోట్లను వెచ్చిస్తోందన్నారు. నిరుద్యోగ భృతిని కనీసం మేనిఫెస్టోలో కూడా పెట్టని వైసిపి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న ఆరు రాష్ట్రాలు కూడా నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదన్నారు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రం రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిరుద్యోగ భృతి కోసం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు. విధివిధానాల రూపకల్పనకు ఒక కమిటీ వేసి తుదిదశకు తెచ్చారన్నారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లనే 2014కు ముందు నిరుద్యోగం పెరిగిందన్నారు. దీని తీవ్రతను తగ్గించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచిందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ లెక్చరర్ల అంశం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెయ్యి రోజుల్లో యువతకు వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అమరావతి కేంద్రంగా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వేదిక, సమయం ఎవరు చెప్పినా సరే, లేదా తాము చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నామని బ్రహ్మం చౌదరి సవాల్ విసిరారు.