ఆంధ్రప్రదేశ్‌

టిడిపి పాలనలోనే ఉద్యోగుల సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుండటం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ పంచుమర్తి అనూరాధ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నించి అభాసుపాలైన ప్రతిపక్షం ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీసులను పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను 50 శాతం మేర పెంచిందని, ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ. 200కోట్లను వెచ్చిస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో పాటు పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు, యూనివర్శిటీల ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచిందన్నారు. నిరుద్యోగుల వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు పెంచినట్లు అనూరాధ గుర్తుచేశారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కష్టాల పాల్జేశారని, తక్కువ వేతనాలు చెల్లించి ఇబ్బందులకు గురిచేశారని ప్రకటనలో అనూరాధ ధ్వజమెత్తారు.