ఆంధ్రప్రదేశ్‌

వికృత పోకడలు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి (జలదంకి), సెప్టెంబర్ 17: సమాజంలో నానాటికీ వికృత పోకడలు భరించలేని స్థాయకి చేరుకున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ సతీమణి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్‌ను కావలి పట్టణానికి చెందిన తెలుగు సాహితీ వేదిక జీవనసాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో నన్నపనేని గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా సమాజంలో వికృత పోకడలు పెరిగిపోతున్నాయన్నారు. ఒకప్పుడు అత్తలు కోడళ్లను వేధించేవారని, ఆ విషయంలో అత్తలను సూర్యకాంతం అనేవారని, కాని నేటి సమాజంలో కోడళ్లు సూర్యకాంతంలా మారి అత్తలను వేధిస్తున్నారని అన్నప్పుడు సభికుల్లో నవ్వులు విరిశాయి.
అయితే ఇప్పటి కోడళ్లు కూడా ఒకనాటికి అత్తలు అవుతారనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం ఏ టీవీ సీరియల్ చూసినా కోడళ్లే విలన్‌లుగా కనిపిస్తున్నారని, ఈ ధోరణి మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత కారణంగా ప్రస్తుత సమాజంలో యువత మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులను పలకరించేందుకు సైతం ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ నిప్పులాంటిదని, రాతియుగం నుంచి మానవజాతి మనుగడకు నిప్పు దోహదపడుతున్నప్పటికి శృతిమించితే అదే నిప్పు మనల్ని దహించి వేస్తుందని, మొబైల్ ఫోన్ కూడా అలాంటిదేనని రాజకుమారి హెచ్చరించారు.