ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై సర్కారు నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ప్రతీ రూపాయి కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని, ఇది చట్టమని, ఈ హక్కును సాధించుకోవడానికి చంద్రబాబునాయుడు రాజీపడకుండా కృషిచేసి తన సమర్ధతను నిరూపించుకోవాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో అరుణ్‌కుమార్ మాట్లాడారు. పోలవరం పనులు జరగడం లేదని చంద్రబాబునాయుడు మూడేళ్లకు గానీ గుర్తించలేదని, 2015 నుంచి తాను గగ్గోలు పెడుతూనే ఉన్నానని ఉండవల్లి ధ్వజమెత్తారు. ఇప్పటికి పోలవరం కాంట్రాక్టును మార్చాలనుకునే దశకు వచ్చారన్నారు. పోలవరం రాజ్యాంగబద్ధమని, చట్టబద్ధమైన ఈ ప్రాజెక్టును అనుకున్నట్టుగా పూర్తిచేయడానికి చంద్రబాబునాయుడు కృషిచేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబునాయుడు సమీక్షించివుంటే ఇప్పటికే 70 శాతం పని జరిగి వుండేదన్నారు. ఇప్పటికైనా సరైన కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. టిడిపి ఎంపి రాయపాటి వల్లే ముఖ్యమంత్రి మూడేళ్లు కావాలనే ఆగారని ఆరోపించారు. ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల నిధులతో పోలవరం హెడ్ వర్క్సు పూర్తయ్యే పరిస్థితివుందని, ఆ కమీషన్లు పోలవరంలోనే చూసుకోవాల్సిందని ఎద్దేవా చేశారు. పోలవరంపై నిర్లక్ష్యం ఈ రాష్ట్రానికి శాపమని, మూడేళ్ల తర్వాతయినా కళ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందని ఉండవల్లి పేర్కొన్నారు.
ఇక నంద్యాలలో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పోలవరం నిర్మాణం, నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారన్నారు. రాష్టమ్రంతా రెండు విడతలుగా డ్వాక్రా గ్రూపులకు రుణ మాఫీ కింద ఇప్పటివరకు రూ.6000 ఇచ్చారని, అయితే మిగిలిన రూ.4000 మాత్రం నంద్యాల ఎన్నికల్లో ముందుగానే డ్వాక్రా సంఘాలకు బ్యాంకు అకౌంట్లలో వేశారని బ్యాంకు అకౌంట్ల పుస్తకాలను మీడియా ముందు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా రూ.4000 వేయకపోయినా నంద్యాలలో మాత్రం జమ చేశారన్నారు. అదేవిధంగా అక్కడ ఖర్చుచేసిన నిధులు చూస్తుంటే రాష్ట్రంలో అన్ని చోట్లా నంద్యాల వంటి ఎన్నికలు రావాలని కోరుకుంటారన్నారు. అధికార పార్టీ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.2 కోట్లు చొప్పున ఆయా నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిల పేరిట విడుదలచేస్తూ ఏకంగా జీవోలు ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనన్నారు. అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పేరిట జీవోలు ఇచ్చారని, దీనిపై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించిన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి అప్పట్లో టిడిపి ఇన్‌చార్జిగావున్న గంగుల ప్రతాపరెడ్డి పేరిట రూ.2 కోట్లు విడుదల చేస్తూ అప్పటి సిఎస్ ఎస్పీ టక్కర్ జీవో జారీచేయడంపై తాను హైకోర్టులో కేసు వేద్దామనుకునే లోపే మార్పులు జరగడంవల్ల కుదరలేదన్నారు.