ఆంధ్రప్రదేశ్‌

గ్రామ స్వరాజ్యం తీసుకొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 18: మహాత్మగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం వచ్చే ఏడాది గాంధీ జయంతి రోజు నాటికి సాకారం అయ్యేలా కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. పల్లెలకు సేవ చేసే శాఖకు బాధ్యతలు స్వీకరించిన ఐదు మాసాలకే గ్రామస్వరాజ్యం నిర్మాణానికి కావల్సిన అత్యవసర ఆలోచనలను అమలు చేయడంలో సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన పలాసలో ఇంగ్లిగాం గ్రామం వద్ద రూ. 215.10 లక్షల వ్యయంతో కిడ్నీ రోగులకు ఎన్టీఆర్ శుద్ధ జలం ప్లాంటును మంత్రి లోకేష్ ప్రారంభించారు. కిడ్నీ రోగులకు కుప్పం నుంచి ఏడు ఆర్వో ప్లాంట్లను తరలించామన్నారు. పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, బారువ, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, మెళియాపుట్టి మండలాల్లో 135 పంచాయతీలకు శుద్ధ జలాన్ని అందిస్తామన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతీ 250 మంది జనాభాకు బిటి రోడ్డు నిర్మిస్తామని, 2018 అక్టోబర్ 2 నాటికి ప్రతీ పంచాయతీలో ఎల్‌ఇడి కాంతులు వెలిగిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. పల్లెటూరుకి సేవే చేస్తే - పరమాత్మున్ని సేవించినట్టే అన్న భావనతోనే ఈ శాఖను కోరి స్వీకరించానన్నారు. విభజనలో కాంగ్రెస్ పాలకులు కట్టుబట్టలతో తరిమేసారని, అటువంటి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏన్నడూ మర్చిపోరాదని, విభజనతో చేసిన వంచనకు బుద్ధిచెప్పాలన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేర్చామన్నారు. అన్నదాతకు రూ. 25,000 కోట్ల రుణమాఫీ చేస్తే, ఆ లెక్కలు కాకి లెక్కలంటూ జగన్ చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు వస్తే శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి వైకాపా తరుపున పోటీ చేసిన వ్యక్తికే రుణమాఫీ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయన్నారు. మూడో విడతగా రుణమాఫీ చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన రూ. 4000 మలివిడతగా ఇస్తామన్నారు. 2006 - 14 సంవత్సరాల మధ్య ఉపాదిహామీ కింద రాష్ట్రానికి వచ్చిన రూ.5000 కోట్ల మెటీరియల్‌ను వెనక్కి పంపిన ఘనత కాంగ్రెస్‌ది అయితే, ప్రతీ గ్రామానికి ఉపాధిహామీ పథకం కింద సిసి రోడ్డులు వేసే ఘనత చంద్రబాబునాయుడుదన్నారు. ఐటి రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో మార్గాలు ద్వారా అనే్వషణ ప్రారంభించామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటి ఉద్యోగాలు, రెండు లక్షల మందికి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాల కల్పన ధ్యేయంగా వచ్చే నెల విశాఖలో సదస్సు ఉందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించి, అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా, ముఖ్యమంత్రి పడుతున్న కష్టానికి కూలీగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు.

చిత్రం..పలాస సభలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్