ఆంధ్రప్రదేశ్‌

రుణమాఫీ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రైతు రుణమాఫీకి సంబంధించి ఏ ఫిర్యాదులు వచ్చినా అదేరోజు పరిష్కరించే విధంగా రైతు సాధికారిక సంస్థ పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గన్నవరం రైతు సాధికారిక సంస్థలో రుణమాఫీపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతుల సమస్యలను మంగళవారం మంత్రి సోమిరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీలో ఏ వర్గానికో, పార్టీకో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. కొంతమంది రైతులు బ్యాంకుల ద్వారా బంగారంపై రుణాలు తీసుకున్నారని ఇలాంటి ఖాతాలకు వ్యవసాయేతర రుణాలుగా బ్యాంకులు గుర్తించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కొంతమంది రైతులు రేషన్ కార్డులకు బదులుగా ఓటరు గుర్తింపు కార్డులు పెట్టడం లాంటి కారణాల వల్ల రుణమాఫీ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటిని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల రుణమాఫీ బాండ్‌లను ఇంకా అందించవలసి ఉందని, వీటిలో 2,400 కార్డులు గుర్తింపు లేనివన్నారు. 57,600 కార్డుదారులకు సత్వరమే బాండ్‌లను అందిస్తామన్నారు. ఇదే తరహాలో పులివెందుల పరిధిలో 1100 మంది రైతులకు సంబంధించిన రుణమాఫీపై సమస్యలు రాగా పరిష్కరించామన్నారు. అదే విధంగా కర్నూలు జిల్లా ములకపల్లి గ్రామానికి చెందిన 101 మంది కౌలు రైతులకు రుణమాఫీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సిపిఐ నాయకుడు రామకృష్ణ సూచనలతో ఆ రైతులకు న్యాయం చేశామన్నారు. గుంటూరు జిల్లా ఆంధ్రా బ్యాంకులో 2వేల ఖాతాల్లో రుణమాఫీలకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో అక్కడకు ప్రత్యేక అధికారిని పంపి సమస్యను పరిష్కరించామన్నారు. రుణమాఫీ పథకంలో భాగంగా మొదటి సంవత్సరం 54.98 లక్షల ఖాతాల్లో 7,564.69 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హార్టికల్చర్‌లో 2లక్షల ఖాతాలకు గాను 384.47 కోట్ల రూపాయలు మాఫీ జరిగిందన్నారు.
రెండవ విడతలో 36లక్షల 69వేల ఖాతాలకు గాను 3,002 కోట్ల రూపాయలతో పాటు 300కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించామన్నారు. మూడవ విడతలో భాగంగా 36లక్షల 72వేల ఖాతాలకు గాను 3,009 కోట్ల రూపాయలతో పాటు 600 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించామని వెల్లడించారు. కార్యక్రమంలో రైతు సాధికారిత సంస్థ ఓఎస్‌డిలు వి.శ్రీరామమూర్తి, పి.నాగార్జున, జి.సురేంద్రబాబు, పి.కృష్ణారావు, ఎం.శర్మ, తదితరులు పాల్గొన్నారు.