ఆంధ్రప్రదేశ్‌

కార్మిక సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కార్మికులు లేకపోతే యాజమాన్యం లేదని, యాజమాన్యం లేకపోతే కార్మికులు లేరని.. ఇద్దరూ సమన్వయంతో ఒకే కుటుంబంలా ముందుకు వెళ్లాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి అన్నారు. విజయనగరం జిల్లాలో మూతపడిన మూడు జ్యూట్ మిల్లులు (బొబ్బిలి, ఈస్ట్‌కోస్టు, అరుణా జ్యూట్ మిల్లు) యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి పితాని సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. ఈ మూడు జ్యూట్ మిల్లులు మూతపడడం వల్ల సుమారు 10వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని కార్మిక సంఘాల నాయకులు మంత్రులకు వివరించారు. తిరిగి జ్యూట్ మిల్లులు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని మంత్రి కోరారు. అయితే తిరిగి జ్యూట్ మిల్లును తిరిగి తెరిపించి నడిపించే ఆర్థిక పరిస్థితి తమకు లేదని మిల్లుల యజమానులు మంత్రులకు తెలియజేశారు. కార్మికులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, డెత్ ఫండ్, ఈఎస్‌ఐ, ఎల్‌ఐసికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని మంత్రులను కార్మిక సంఘాల నేతలు కోరారు. అనంతరం ఈ సమస్యపై కార్మికసంఘాలు, యాజమాన్యాలతో మంత్రులు విడివిడిగా చర్చలు జరిపినా పరిష్కారం కుదరలేదు. మరో 20 రోజుల తరువాత మరో సమావేశం ఏర్పాటుచేసి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు తెలిపారు. ఒకరోజు జీతం పెండింగ్‌లో ఉందని, కార్మికులు మంత్రికి తెలియజేయగా, పెండింగ్‌లో ఉన్న ఒకరోజు వేతనం, ఎల్‌ఐసి, డెత్ ఫండ్ వారం రోజుల్లో కార్మికులకు అందజేయాలని యాజమాన్యాన్ని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మికశాఖ అడిషనల్ కమిషనర్ సూర్యప్రసాద్, యాజమాన్యం తరుపున కెవి రావు, కార్మిక సంఘాల ప్రతినిధులు సన్యాసిరావు, శంకర్రావు, ధర్మారెడ్డి, అచ్చంనాయుడు, ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.