ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాలని అందుకు అధికారులు కృతనిశ్చయంతో ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు. గురువారం నగరంలోని ఎ కనె్వన్షన్ హాల్లో నిర్వహించిన రెండవరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా రెండవ రోజు మధ్యాహ్నం సెషన్‌లో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ప్రజలే ముందు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రియల్‌టైమ్ గవర్నెన్స్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ఇప్పటికే దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు అనేక అవకాశాల కల్పనకు వీలు ఏర్పడిందన్నారు. అనంతరం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలైన సంక్షేమంపై సమీక్షలు చేశారు. 2016-17 సంవత్సరానికి కాపు కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల నిధులతో వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మూడు పథకాలు విదేశీ విద్యాదీవెన, ఉద్యోన్నతి, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అన్ని జిల్లాల్లో 5కోట్లతో రెండు ఎకరాల్లో కాపు భవనాలు నిర్మించడానికి స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడి మూడు సంవత్సరాలు అయిందని, ఈ మూడు సంవత్సరాల్లో తొమ్మిది పథకాలను వారికి అందిస్తున్నామన్నారు. చంద్రన్న బీమా ద్వారా యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయినవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 73వేల 228 క్లైములు పరిష్కరించి రూ.233 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. అక్టోబర్ 2 నుండి చంద్రన్న బీమా ప్రధానమంత్రి చంద్రన్న బీమాగా మారనుందన్నారు. అనంతరం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలను రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలో, రాష్ట్ర రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో వసతుల మెరుగుదలతో పాటు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.69,479 కోట్లు వివిధ సెక్టార్లలో పెట్టుబడులు వచ్చాయన్నారు. గ్రామాల్లో ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటు విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. విజయవాడ-మచిలీపట్నం 65 కిలోమీటర్ల రహదారిని నవంబరు 2018 నాటికి ప్రారంభించాల్సి ఉండగా సెప్టెంబర్ నాటికే ప్రారంభించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే పనులు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష చేసారు. దీనికి సంబంధించి వివిధ జిల్లా కలెక్టర్లు తీసుకున్న చర్యలను పరిశీలించారు. విద్యుత్ వాహనాలను ముందుగా తిరుపతి, విశాఖపట్నంలలో ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేయాలని అనంతరం అమరావతిలో కూడా ప్రవేశపెట్టాలని సూచించారు. స్మార్టు పవర్ గ్రిడ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రకాశం జిల్లాలో గనే్నరు చెట్లు వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రికి సూచించగా జాతీయ రహదారి సంస్థ అధికారులు పొల్యూషన్ అదుపులో ఉంచేందుకు అది బాగా దోహదపడుతుందని తెలిపారు. అధికారుల సమన్వయంతో దానిపై తగిన చర్యలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిఇవో బాబు.ఎ మాట్లాడుతూ రాష్ట్రంలో సిసి కెమెరాలు ఏర్పాటుతో చేకూరే లాభాలను ప్రత్యేక స్లైడ్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా డ్రోన్ సర్వీసెస్ ద్వారా అత్యుత్తమ రెజ్యూమ్ గల ఇమేజ్‌తో వీడియోని ప్రదర్శించారు. రెవెన్యూ డిపార్టుమెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తూ ఇప్పటివరకు ఆ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలించారు. ఈ మూడు సంవత్సరాల్లో రెవెన్యూ శాఖ ఆదాయ పరంగా అభివృద్ధి 14.55 శాతానికి పెంచామన్నారు. జిఎస్‌టితో కేంద్ర ప్రభుత్వానికి రూ.1220 కోట్లు పన్ను రూపంలో చెల్లించామన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యంగా బెల్టుషాపుల నియంత్రణలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అక్రమ సారా, గంజాయి సాగులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం సదావర్తి భూములపై తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ సదావర్తి భూములపై సంబంధిత శాఖ సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ వివాదాలు వస్తున్నాయన్నారు.