ఆంధ్రప్రదేశ్‌

దక్షిణాదిలో బిజెపి పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ఉత్తరాదిలో బలపడిన భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు చెప్పారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాదిలో బిజెపి బలపడడానికి తెలుగుదేశం పార్టీ అడ్డంకి కాదని అన్నారు. మిత్రపక్షాలు బలపడితేనే, ఎన్డీయే కూటమి బలంగా ఉంటుందని ఆయన అన్నారు. దక్షిణది రాష్ట్రాల్లో ఉన్న 130 లోక్‌సభ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు పార్టీ అథిష్టానం వ్యూహ రచన చేస్తోందని అన్నారు.
ఐదు లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వీరంతా కృషి చేయాల్సి ఉందని చెప్పారు. జిఎస్‌టి, పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గాల పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పదాధికారికి కచ్చితమైన బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మండల, గ్రామ, బూత్ కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని ఆయన సూచించారు. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసి, వారు ప్రజల్లోకి వెళ్లేలా పదాధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న బీమా పథకాన్ని తెలుగుదేశం పార్టీ వారు చంద్రన్న బీమాగా మార్చి ప్రజలకు అందిస్తున్నారని నాయకులు మురళీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాస్తవానికి ఈ బీమా పథకాన్ని ప్రధాని మోదీ రూపకల్పన చేశారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండడంతో పథకాన్ని మొత్తం వారు చంద్రన్న బీమాగా మార్చుకున్నారని మురళీథర్ చెప్పారు. ఈ నెల 30 నుంచి ఈ పథకానికి ప్రధాని చంద్రన్న బీమా పథకం ప్రాచుర్యంలోకి వెళుతుందని ఆయన తెలియచేశారు.