ఆంధ్రప్రదేశ్‌

శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 21: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
గురువారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు సంప్రదాయబద్దంగా ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, యాగశాలప్రవేశం, చండీ కలశస్థాపన నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, రుద్రకలశపూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
రాత్రి రుద్రహోమం, చండీహోమం, సువాసినీ పూజ, కాళరాత్రి పూజ నిర్వహించారు. అమ్మవారిని శైలపుత్రి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వసించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భృంగి వాహనంపై ఆశీనులను జేసి పూజలు నిర్వహించారు. రాత్రి భృంగి వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు.

చిత్రాలు.. శైలపుత్రి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక .*
.్భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లు