ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్నపనాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు జరిగాయి. తొలిరోజున దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తుకోటికి దర్శనమిచ్చింది. మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ఇవో ఎ.సూర్యకుమారి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబులతో కలిసి ఉత్సవ మూర్తులను మహా మండపంలోకి తోడ్కొని వచ్చారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు భక్తులందరికీ మహాదర్శనంకు అవకాశం కల్పించారు. శుక్రవారం నుంచి తెల్లవారుజాము మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన అవకాశం లభిస్తుంది. ఉదయానే్న నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, డెప్యూటీ కమిషనర్ క్రాంతిరాణా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థాన తరఫున టిటిడి జెఇవో శ్రీనివాసరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో జరిగే ముఖ్య ఉత్సవాల సమయాల్లో టిటిడి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తున్నదన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్దా రాఘవరావుసామాన్య భక్తులతో పాటు వినాయకుని గుడి నుంచి క్యూ లైన్లలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందుకోసం 35 నిమిషాల సమయం పట్టింది. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ ఈ పది రోజుల్లో రెండు శుక్రవారాలు, ఒక ఆదివారం ఉన్నాయని, ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండగలదని, అయితే అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు.

చిత్రాలు.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అవతారంలో అమ్మవారు
*అమ్మవారికి టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్న జెఇఓ శ్రీనివాసరాజు