ఆంధ్రప్రదేశ్‌

బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా విశాఖ రైల్వే స్టేషన్‌కు గుర్తింపు లభించింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం విశాఖ రైల్వే స్టేషన్‌లో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు, సమాచారాన్ని అందిస్తున్నట్టుగా గుర్తించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా ఈ నెల 27న విశాఖపట్నం ఆర్‌కె బీచ్ వద్ద జరిగే కార్యక్రమంలో స్టేట్ టూరిజం యాన్యువల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2017ను పర్యాటక శాఖ అందజేయనుంది. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా పరిశుభ్రతలో విశాఖ రైల్వే స్టేషన్ నెంబర్-1 రైల్వే స్టేషన్‌గా భారతీయ రైల్వే గుర్తింపునిచ్చింది. దీంతో ఏ1 క్యాటగిరీ స్టేషన్‌గా దీనిని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడం, దీనిని ప్రోత్సహించడంలో భాగస్వాములుగా నిలిచే వివిధ వర్గాలు, పలు సంస్థలకు అవార్డులు అందజేస్తుంటారు. ఈ విధమైన పర్యాటక సేవలు అందించడంలోనూ, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలోనూ విశాఖ రైల్వే స్టేషన్ ముందంజలో నిలిచింది. పర్యాటకంగా స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ వెయిటింగ్ హాళ్లల్లో కూర్చొనే సదుపాయం, ఏసి/నాన్ ఏసి, టాయిలెట్స్, ఈటింగ్ ఔట్‌లెట్స్, ఫుడ్‌కోర్ట్స్, కెమిస్ట్ స్టాల్స్ వంటి మెరుగైన వసతులు విశాఖ రైల్వే స్టేషన్‌లో కల్పించారు. అలాగే నిరంతరం ప్లాట్‌ఫారాలు, ట్రాక్‌ను పరిశుభ్రంగా ఉంచడం, ఆధునిక పద్ధతిలో ఉండే డస్ట్‌బిన్ల ఏర్పాటు, బయోటాయిలెట్ల ద్వారా ట్రాక్ శుభ్రతను సాధించడం, పర్యాటక ఫెసిలిటేషన్ కౌంటర్, ప్రీ-పెయిడ్ ఆటో/టాక్సీ సర్వీస్, వౌలిక వసతులతో కూడిన రిటైరింగ్ రూమ్‌లు అందుబాటులోకి తీసుకురాగలిగారు.
ఎకో ఫ్రెండ్లీ ప్రమాణాలను పాటించడంలో భాగం గా బయోటాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ సిస్టమ్ వంటివి పటిష్టంగా అమలవుతున్నాయి. వీటితోపాటు దివ్యాంగుల ర్యాంప్స్, బ్యాటరీ ఆపరేటేడ్ కార్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు తదితర అత్యాధునిక వసతులు విశాఖ రైల్వే స్టేషన్‌లో కల్పించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి టివిలు, రైలు/కోచ్‌ల్లో ఇండికేషన్ బోర్డుల ఏర్పాటు, పర్యాటకుల కోసం ప్రత్యేకించిన విస్టాడోమ్ కోచ్‌ను విశాఖపట్నం-అరకు ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్, రిజర్వ్ చేయబడిన ఏసి లాంజ్, నూతన డిజి పే నగదు రహిత లావాదేవీల వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

చిత్రం..బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా నిలిచిన విశాఖ రైల్వే స్టేషన్