ఆంధ్రప్రదేశ్‌

ఆ బాధలు పడలేం..తీసుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: రాష్ట్ర విభజన జరిగింది..కానీ మా పరిస్థితి ఏమిటి.. తెలంగాణ నుంచి మీరు వెళ్ళిపోండని క్షేత్రస్థాయిలో అవమానాలు పడుతూ బతుకుతున్నామని తెలంగాలో పని చేస్తున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు దొరక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానికేతర కోటాలో ఉద్యోగాలు చేస్తున్న శ్రీకాకుళం, విజయనగరం వాసులకు ఇప్పడు తెలంగాణ ప్రాంతంలో కష్టాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అక్కడ ఉంటూ ఎన్నోమాటలు పడాల్సి వస్తోందని వారు కంట తడిపెట్టారు. తల్లిదండ్రులు ఇక్కడ, ఉద్యోగరీత్యా తాము అక్కడ ఉన్నామని, ఏ శుభకార్యానికి రావాలన్నా అనేక వ్యయప్రయాసలు పడుతున్నామని ‘ఆంధ్రభూమి’కి పలువురు ఉపాధ్యాయులు చెప్పారు. విభజన అనంతరం తమ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. మా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్నారు. స్థానికత ఆధారంగా తమకు డిప్యూటేషన్ వేసినా ఏదో మారుమూల గ్రామాలకు వేస్తున్నారని, కిందస్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరూ తమను ఇబ్బంది పెడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కనీసం తల్లిదండ్రులను చూసుకోవడానికి రావాలంటే సెలవు మంజూరు చేయడం లేదన్నారు. ఈ మద్య డిఎస్సీ నోటిఫికేషన్‌తో ఇక ఆధ్రప్రదేశ్‌కు రావాలంటే అవుతుందా లేదా అన్న అనుమానం ఉందన్నారు. ఆంధ్రాలో తెలంగాణ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారిని అక్కడకు పంపి తమను ఇక్కడికి తీసుకొస్తే జీవితాతం రుణపడి ఉంటామని వందలాది మంది ఉపాధ్యాయులు శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడును శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. స్థానికత సమస్యగా ఆడపిల్లలకు ఈ రోజుకు కూడా చాలా మంది పెళ్ళిళ్ళు అవ్వడం లేదని ఓ ఉపాధ్యాయురాలు ఎంపి ముందు కన్నీరు పెట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఖాళీగా ఉన్న పాఠశాలల్లో తమకు అంతర్రాష్ట్ర బదిలీ కింద తీసుకురావాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ సమస్యను ముఖ్యమంత్రికి తీసుకెళ్తానని, పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించడానికి ప్రయత్నిస్తానని ఎంపి చెప్పారు.

చిత్రం..ఎంపి రామ్మోహన్‌నాయుడుకు తమ కష్టాలు ఏకరవు పెడుతున్న తెలంగాణలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు