ఆంధ్రప్రదేశ్‌

బాలా త్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండోరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ శుక్రవారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ అశేష భక్తకోటికి దర్శనమిచ్చింది. శుక్రవారం అమ్మవారికి పవిత్రమైన రోజు కావటంతో ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము మూడు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకోటం ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అర్ధరాత్రి నుంచే పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మ దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తకోటితో రాత్రి 11 గంటల వరకు కూడా ఇంద్రకీలాద్రి ఇసుకవేస్తే రాలనంతగా కిటకిటలాడింది. సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరచి స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనల తర్వాత దుర్గమ్మను శ్రీబాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరించారు.
ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. మరోవైపు భవానీ దీక్ష మండపంలో ఉత్సవ మూర్తులకు ఉభయదాతల ఆధ్వర్యంలో కుంకుమపూజ జరిగింది. ఒక చేతిలో జపమాల.. మరో చేతిలో పుస్తకం పట్టుకుని అముష్మిక, ఐహిక లక్షణాలన్నీ తనలో ప్రతిబించేలా దుర్గమ్మ దర్శనమిచ్చింది. అన్నింటి మించి శ్రీచక్రంలోని నవావరణాల్లో తొలి దేవతగా పిలువబడే బాలాదేవి పట్టు పీతాంబరాలు, పసుపు కుంకుమల రూపాతిశయంతో దుర్గమ్మ భక్తులను కనువిందు చేసింది. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖుల్లో రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్‌నాధ్‌రెడ్డిలకు ఆలయంలోని వేద పండితులు వీరందరికీ వేదాశీర్వచనం చేశారు.