ఆంధ్రప్రదేశ్‌

విజువలైజేషన్.. మితాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: విజువలైజేషన్.. మితాహారం వంటివి పాటించడమే తన ఆరోగ్య, కలల సాకార రహస్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియాతో కొద్ది సేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్ని గంటలు పని చేసినా, అలసిపోని తన ఆహార, ఆరోగ్య విశేషాలను వెల్లడించారు. తాను ఆహారంపై స్వీయ నియంత్రణ పాటిస్తానన్నారు. తాను ఉదయానే్న 30 నిమిషాల సేపు వ్యాయామం చేస్తానని తెలిపారు. అనంతరం విజువలైజేషన్ ప్రక్రియ 30 నిమిషాల సేపు చేస్తానన్నారు. అందరూ మెడిటేషన్ చేస్తారని, కానీ తాను విజువలైజేషన్ చేస్తానని తెలిపారు. ఆ ప్రక్రియ గురించి వివరిస్తూ, మొదట మూడు నిమిషాలు తన పుట్టుక, బాల్యం గురించి ఆలోచిస్తానని తెలిపారు. అనంతరం కొంత సేపు తాను ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చా.. ఎలా పెరిగా.. ఏమి చేయాలి వంటి విషయాలను ఆలోచిస్తానన్నారు. అనంతరం తాను చేయాల్సిన పనుల గురించి సంకల్పం చేసుకుంటానని తెలిపారు. తన కలలను సాకారం చేసుకునేందుకు చేసుకునే సంకల్పం చాలా సందర్భాల్లో కార్యరూపం దాల్చిందని వెల్లడించారు. విమానాల మరమ్మతు నిర్వహణ యూనిట్, అమెరికన్ వర్సిటీలతో ఒప్పందం వంటివి ఉన్నాయన్నారు. ఉదయం రాగి లేదా జోన్నతో చేసిన ఇడ్లీ లేదా రెండు దోశెలు, మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో తయారైన ఆహారం, ఆకు కూరలు తీసుకుంటానని తెలిపారు. సాయంత్రం 6-7 గంటల మధ్య ఒక సూప్, ఒక పండు, రెండు ఎగ్‌వైట్‌లను తింటానని తెలిపారు. రాత్రి ఆకలేస్తే, ఒక పండు తింటానని తెలిపారు. ఆరు గంటలు నిద్రపోతానని తెలిపారు. మితాహారం, వ్యాయామం, పనిని ఇష్టపడి చేయడం వల్ల అలసట దరిచేరదని చెప్పారు. ఎయిర్ కండిషనింగ్ ఉండటం లగ్జరీ కాదని, అవసరమని స్పష్టం చేశారు. వేడి వాతావరణంలో, మనసు నిలకడగా ఉండదని, సరైన నిర్ణయాలు తీసుకోలేరని తెలిపారు. గతంలో ఐఎఎస్‌ల వ్యవస్థ దాదాపు రెగ్యులేటరీ వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా మారిందన్నారు. ఎన్టీఆర్ రాకముందు సంక్షేమ కార్యక్రమాలు లేవని, కిలో బియ్యం రూపాయితో సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రారంభమయ్యాయన్నారు. తమ గ్రామంలో తన చిన్నప్పుడు ఊట కాలువల్లో 3, 4 నెలలు మాత్రమే నీరు ఉండేదని, నీటిని రైతులు వాడుకునేందుకు ఒక విధమైన నీటి గడియారాన్ని ఉపయోగించేవారని గుర్తు చేసుకున్నారు. తాను పాఠశాలలో చదివే రోజుల్లో విద్యుత్ సౌకర్యం గ్రామంలో లేదని, ఆ తరువాత వచ్చిందన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు, రెండు ఆర్మీ జీపులు ఇచ్చేవారని తెలిపారు. ఆగిపోతే, తోసుకుని వెళ్లాల్సి వచ్చేదన్నారు. గ్యాస్, టెలిఫోన్‌కు కూపన్లు, సిఫారులు అవసరమయ్యేవని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.